https://oktelugu.com/

KCR: కేసీఆర్ మకాం ఇకపై ఢిల్లీలోనే.. కేంద్రంపై కోట్లాడుడేనట?

KCR stays in Delhi: తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంతో తాడోపేడుకు సిద్ధమయ్యారా? అంటే అంతా అవుననే సమాధానమే విన్పిస్తోంది. జాతీయ రాజకీయాలపై తొలి నుంచి ఆసక్తి కనబరుస్తున్న సీఎం కేసీఆర్ ఆ దిశగా మరోసారి పావులు కదుపుతున్నారు. గతంలో ఫెడరల్ ఫ్రంట్ ను తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించి విఫమైనా ఈసారి మాత్రం తగ్గెదేలే అన్నట్లుగా ముందుకెళుతున్నారు. తెలంగాణలో వరుసగా రెండు పర్యాయాలు టీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతోంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : April 16, 2022 9:51 am
    Follow us on

    KCR stays in Delhi: తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంతో తాడోపేడుకు సిద్ధమయ్యారా? అంటే అంతా అవుననే సమాధానమే విన్పిస్తోంది. జాతీయ రాజకీయాలపై తొలి నుంచి ఆసక్తి కనబరుస్తున్న సీఎం కేసీఆర్ ఆ దిశగా మరోసారి పావులు కదుపుతున్నారు. గతంలో ఫెడరల్ ఫ్రంట్ ను తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించి విఫమైనా ఈసారి మాత్రం తగ్గెదేలే అన్నట్లుగా ముందుకెళుతున్నారు.

    తెలంగాణలో వరుసగా రెండు పర్యాయాలు టీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతోంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ తన పాలన కొనసాగిస్తున్నారు. ఇక మచ్చటగా తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే రైతు పక్షాన సీఎం కేసీఆర్ పోరాటాలకు సిద్ధమవుతున్నారు.

    వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఒకరోజు దీక్ష సైతం చేశారు. కేంద్రానికి 24గంటల డెడ్ లైన్ కూడా విధించారు. అయితే కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో సీఎం కేసీఆర్ క్యాబినేట్ సమావేశం నిర్వహించి తెలంగాణలో పండిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు.

    తద్వారా కేంద్రాన్ని బాదానం చేస్తూనే గంపగుత్తగా రైతాంగాన్ని తనవైపు తిప్పుకునేలా కేసీఆర్ ప్లాన్ చేశారు. స్థానిక బీజేపీ నేతలు మాత్రం తమ పోరాటాలతోనే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ధాన్యం కొనుగోలు చేపడుతోందని ప్రచారం చేసుకుంటున్నారు. ఏదిఏమైనా సీఎం కేసీఆర్ తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు అంశానికి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పెట్టడంతో రైతులు ఎవరివైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది.

    మరోవైపు ఇటీవలే వారంరోజుల పాటు ఢిల్లీలో మకాం వేసిన కేసీఆర్ మరోసారి ఢిల్లీకి వెళుతున్నారు. ఆయన ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ఓ వారం పదిరోజులపాటు షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈసారి మాత్రం రెండు వారాలపాటు ఆయన ఢిల్లీలోనే ఉండి పూర్తిస్థాయి రాజకీయాలు చేస్తారనే టాక్ టీఆర్ఎస్ లో విన్పిస్తోంది.

    గతేడాది ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖేరీలో రైతులపైకి ఓ కేంద్ర మంత్రి కుమారుడు కారు ఎక్కించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విషయంపై ఇన్నాళ్లు సైలంట్ గా ఉన్న సీఎం కేసీఆర్ తాజా పర్యటనలో బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం చేయనున్నారని తెలుస్తోంది.

    అదేవిధంగా ఢిల్లీ, లక్నో, ముంబై లాంటి నగరాల్లోని ప్రముఖులతో కేసీఆర్ భేటి కానున్నారని సమాచారం. మొత్తానికి సీఎం కేసీఆర్ అనధికారికంగా ఢిల్లీలో మకాం వేసినట్లేనని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.