https://oktelugu.com/

Presidential Candidate: కేసీఆర్, సౌత్ ఇండియా ఎఫెక్ట్: వెంకయ్యే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి?

Presidential Candidate? దేశంలో ఇప్పుడు విభజన రాజకీయాలు నడుస్తున్నాయి. ఏకచత్రాధిపత్యంగా విరాజిల్లుతున్న బీజేపీని ఎదుర్కోవడానికి దేశంలో ప్రత్యామ్మాయ శక్తి అవసరం అన్న ఆలోచన ప్రతిపక్షాల్లో బలంగా కనపడుతోంది. అందుకే విపక్ష పార్టీలన్నీ కలిసి రాష్ట్ర పతి రేసులో ఉమ్మడి అభ్యర్థిగా ‘యశ్వంత్ సిన్హా’నే నిలబెడుతున్నాయి. ఆయన అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి. పైగా బీజేపీలో వెలుగు వెలిగిన సీనియర్ పాత నేత. సో ఈయన కన్నుతోనే బీజేపీని పొడవాలని కాంగ్రెస్, టీఎంసీలు స్కెచ్ గీస్తున్నాయి. అందుకే ఈసారి దళిత, […]

Written By:
  • NARESH
  • , Updated On : June 21, 2022 3:58 pm
    Follow us on

    Presidential Candidate? దేశంలో ఇప్పుడు విభజన రాజకీయాలు నడుస్తున్నాయి. ఏకచత్రాధిపత్యంగా విరాజిల్లుతున్న బీజేపీని ఎదుర్కోవడానికి దేశంలో ప్రత్యామ్మాయ శక్తి అవసరం అన్న ఆలోచన ప్రతిపక్షాల్లో బలంగా కనపడుతోంది. అందుకే విపక్ష పార్టీలన్నీ కలిసి రాష్ట్ర పతి రేసులో ఉమ్మడి అభ్యర్థిగా ‘యశ్వంత్ సిన్హా’నే నిలబెడుతున్నాయి. ఆయన అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి. పైగా బీజేపీలో వెలుగు వెలిగిన సీనియర్ పాత నేత. సో ఈయన కన్నుతోనే బీజేపీని పొడవాలని కాంగ్రెస్, టీఎంసీలు స్కెచ్ గీస్తున్నాయి.

    అందుకే ఈసారి దళిత, గిరిజన కుల సమీకరణాలు పక్కనపెట్టి గెలుపు కోసం బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును రాష్ట్రపతి రేసులో నిలబెట్టేందుకు యోచిస్తోంది. ఈమేరకు బీజేపీలోని కీలకమైన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లు వెంకయ్యనాయుడుతో సమావేశం కావడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చినట్టైంది.

    ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ నిర్ణయాలు చాలా వివాదాస్పదమవుతున్నాయి. ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని విపక్షాలు ఏకమవుతున్నాయి. ఇక కేసీఆర్ లాంటి ప్రాంతీయ పార్టీ నేతలు అప్పుడే ‘సౌత్ ఇండియాకు’ అన్యాయం జరుగుతోందని.. నిధులు, నియామకాల్లో సౌత్ ఇండియాకు ప్రాధాన్యం లేదని దేశవ్యాప్తంగా కొత్త డిమాండ్ లేవనెత్తడానికి రెడీ అవుతున్నారు. దేశాన్ని పాలించే నేతలందరూ ఉత్తర భారతానికి చెందిన వారేనని ఆరోపిస్తున్నారు. సౌత్ ఇండియాలో బీజేపీ లేకపోవడంతో ఇక్కడి వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.

    ఇది మరింత ముదరకముందే దేశంలో విభజన రాజకీయాలు రాకూడదనే వెంకయ్య నాయుడును రాష్ట్రపతి అభ్యర్థిగా తెరపైకి తెచ్చినట్టు కనిపిస్తోంది. వెంకయ్యను రాష్ట్రపతిగా చేస్తే సౌత్ ఇండియాకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు కేసీఆర్ లాంటి వారి నోళ్లు మూయించినట్టు అవుతుంది. అదే సమయంలో సౌత్ ఇండియాలోని ప్రాంతీయ పార్టీలైన టీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ సహా ఇతరుల నుంచి మద్దతు కూడగట్టవచ్చు.

    అందుకే దళిత, గిరిజన అభ్యర్థిని పక్కనపెట్టి వ్యూహాత్మక కోణంలోనే ఒకప్పుడు బీజేపీ సీనియర్ పొలిటీషయన్ అయిన వెంకయ్యను రాష్ట్రపతిని చేస్తున్నారని సమాచారం. ఇక 2024 ఎన్నికల్లో హంగ్ వచ్చినా రాష్ట్రపతి కీలకంగా మారుతారు. అప్పుడు బీజేపీ వాది అయిన రాజకీయ భీష్ముడు వెంకయ్య లాంటి వారు ఉంటే కమలం పార్టీకి చాలా ఉపయోగపడుతుంది. భవిష్యత్తు రాజకీయాలను ఆలోచించి వెంకయ్యనే ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.

    ఇక వెంకయ్య లాంటి వారుంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు ఇతరుల మద్దతు పొందడం ఈజీ. అందరికీ ఆమోదయోగ్యుడిగా వెంకయ్య ఉంటారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓటు కూడా బీజేపీకి పడే చాన్స్ ఉంది. వెంకయ్య అంటే కేసీఆర్ కు చాలా అభిమానం. ఇక సౌత్ ఇండియాకు అన్యాయం అన్న మాటను వెంకయ్యతో తుడిచివేయవచ్చని.. దేశంలోనే ప్రథమ పౌరుడిగా సౌత్ ఇండియా వ్యక్తిని చేసి బీజేపీ ఇక్కడి వారికి ప్రాధాన్యం ఇచ్చినట్టు అవుతుందని భావిస్తోంది.

    అందుకే రిటైర్ అయిపోవాల్సిన వెంకయ్యను వెనక్కి పిలిపించి మరీ రాష్ట్రపతిగా చేస్తోంది బీజేపీ. కేంద్రమంత్రిగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న వెంకయ్యను వద్దంటున్నా ఉపరాష్ట్రపతిని చేసిన బీజేపీ.. ఇప్పుడు అవసరార్థం రాష్ట్రపతిగా నామినేట్ చేయాల్సి వస్తోంది. బీజేపీ అవసరాలే వెంకయ్య రాష్ట్రపతి కావడానికి కారణమవుతున్నాయి.