KCR vs Modi: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోజురోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. ఈ ఘటన జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా హీట్ చల్లారడం లేదు. ఇందులో కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పట్లో ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి సి వి ఆనంద్ ఆధ్వర్యంలో సిట్ ను ఏర్పాటు చేసిన కేసీఆర్… ఒకానొక దశలో బిజెపి పెద్దల్ని బయటికి లాగే ప్రయత్నం చేశారు. అయితే ఆలస్యంగా మేల్కొన్న బిజెపి నాయకులు జాగ్రత్త పడ్డారు. అంతేకాదు ఈ కేసులో లోతుల్ని కనుక్కొని… మోడీ ఈడీని రంగంలోకి దించారు. దెబ్బకు సీన్ మొత్తం మారిపోయింది. ఫలితంగా కెసిఆర్ ఏర్పాటు చేసిన సిట్ కు చుక్కలు కనిపిస్తున్నాయి.

మనీ లాండరింగ్ కోణంలో ..
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును మనీ లాండరింగ్ కోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.. మొయినాబాద్ ఎపిసోడ్ లో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడి అధికారులు ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.. రోహిత్ రెడ్డిని గడిచిన రెండు రోజుల్లో ఏకంగా 14 గంటల పాటు విచారించారు.. పలు అంశాలపై కీలక ఆధారాలు సేకరించారు.. తాజాగా నందకుమార్ పై దృష్టి సారించారు.. చంచల్ గూడ జైల్లో ఉన్న అతడిని విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు సిద్ధమయ్యారు.. అనుమతి ఇవ్వాలని ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. దీనిపై ఇవాళ కోర్టు విచారణ జరుగనున్నది.
రోజుకో పేరు వెలుగులోకి
తాజాగా ఈ కేసులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.. మాణిక్ చంద్ గుట్కా వ్యాపారంలో రితీష్ లావాదేవీలు జరిపినట్లు ఈడి అధికారులు గుర్తించారు. హోటల్ వ్యాపారంలోనూ అతనికి భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించారు.. గతంలో ఒక పబ్ లో గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పై జరిగిన దాడిలో రితీష్ పేరు కూడా వినిపించింది. అప్పట్లో ఈ పంచాయతీ కేటీఆర్ వద్దకు వెళ్ళగా ఆయన రితీష్ ను మందలించి పంపించారు. వైపు మాణిక్ చంద్ గుట్కా సంస్థ డైరెక్టర్ అభి షేక్ కారుల ఎదుట గురువారం విచారణకు హాజరయ్యారు. తన బ్యాంకు ఖాతాలు, స్థిర, చరాస్తుల వివరాలు, వ్యాపారాల వివరాలను వెల్లడించారు.
మరోవైపు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో రోహిత్ రెడ్డి తో పాటు మిగతా ఎమ్మెల్యేలపై దృష్టి సారించింది. మనీ లాండరింగ్ కోణంలో విచారణ జరుపుతున్న ఈడి ఇప్పటికే రోహిత్ రెడ్డిని విచారించింది.. జైల్లో ఉన్న నందును విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది..రామచంద్ర భారతి, సింహ యాజి కి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది.. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేసేందుకు సిద్ధమైంది. మరవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రామచంద్ర భారతి నకిలీ పాస్ పోర్ట్ కేసులో గురువారం నాంపల్లి మూడవ అడిషనల్ మెజిస్ట్రేట్ ఎదుట లొంగిపోయారు. బెయిల్ కోసం ఆయన చేసిన విజ్ఞప్తిని మెజిస్ట్రేట్ తిరస్కరించి… 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు రామచంద్ర భారతిని చంచల్ గూడ జైలుకు తరలించారు.