తెలంగాణ ఇంజనీర్లకు సెల్యూట్ చేసిన కేసీఆర్

తెలంగాణ ఇంజనీర్ల ప్రతిభకు కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనమని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. శుక్రవారం కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ను ఆయన ప్రారంభించారు. చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, చిన్నజీయర్ స్వామిలు మర్కుక్‌ పంప్‌హౌస్‌ నుంచి కొండపోచమ్మసాగర్‌లోకి నీటిని ఎత్తి పోసే మోటర్లను ప్రారంభించారు. అనంతరం కొండపోచమ్మ కట్టపై గోదావరి నీటికి సీఎం కేసీఆర్‌ జలహారతి ఇచ్చారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ వాళ్లకు పరిపాలన […]

Written By: Neelambaram, Updated On : May 29, 2020 3:45 pm
Follow us on


తెలంగాణ ఇంజనీర్ల ప్రతిభకు కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనమని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. శుక్రవారం కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ను ఆయన ప్రారంభించారు. చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, చిన్నజీయర్ స్వామిలు మర్కుక్‌ పంప్‌హౌస్‌ నుంచి కొండపోచమ్మసాగర్‌లోకి నీటిని ఎత్తి పోసే మోటర్లను ప్రారంభించారు. అనంతరం కొండపోచమ్మ కట్టపై గోదావరి నీటికి సీఎం కేసీఆర్‌ జలహారతి ఇచ్చారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.

తెలంగాణ వాళ్లకు పరిపాలన చేతకాదు.. మీరు ఎలా పాలించుకుంటారో చూస్తాం అన్నవారికి నేడు తెలంగాణ రాష్ట్రం ఆరేళ్లలో సాధించిన అభివృద్దే నిదర్శనమని అన్నారు. సాగునీటి చరిత్రలో తెలంగాణ ఇంజనీర్లు అద్భుతాలను ఆవిష్కరించారనిన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ ఇంజినీర్లు ఎంత శక్తిమంతులో, నైపుణ్యవంతులో ప్రపంచానికి తెలియవచ్చిందన్నారు. తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసిన తెలంగాణ ఇంజనీర్లకు సెల్యూట్ చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టు కోసం భూములను ఇచ్చిన నాలుగు ఊళ్ల ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనలు చేస్తున్నానని చెప్పారు. రైతులకు భూములు కోల్పోయిన బాధ ఉంటుందని అయితే ప్రాజెక్టును గాలిలో కట్టలేమన్నారు. ఈప్రాంతంలోనే ప్రభుత్వం ఫుడ్ టెక్స్ టైల్స్ పార్కులను స్థాపించి అందరికీ ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అదేవిధంగా ప్రజలుకు భూపరిహారం అందించాలని సకాలంలో భూములను అందించిన రెవెన్యూ శాఖను కూడా కేసీఆర్ అభినందించారు.

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వల్ల తెలంగాణలో సంవత్సారానికి లక్ష కోట్ల రూపాయల పంట పండబోతుందని అన్నారు. ప్రస్తుతం దేశంలో 83లక్షల టన్ను వరి ధాన్యం సేకరిస్తే 53లక్షల టన్నులు తెలంగాణ నుంచే వచ్చిందని సాక్షాత్తూ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేర్కొందని తెలిపారు. కాళేశ్వరానికి 4,800 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. పేరున్న కంపెనీలన్నీ ఈ ప్రాజెక్టు కోసం పనిచేశాయన్నారు. తెలంగాణకు 165 టీఎంసీల నూతన సామర్థ్యం వచ్చి చేరిందన్నారు. ఆరేళ్ల కింద అనాథలా ఉన్న తెలంగాణ నేడు మాత్రం పసిడి పంటల తెలంగాణగా మారిందన్నారు. త్వరలోనే తెలంగాణ రైతులకు మరొక తీపి కబురు చెబుతానని.. దేశం నివ్వెరబోయేలా చేస్తానంటూ కేసీఆర్ ప్రకటించారు.