KCR: తెలంగాణ ఎన్నికలకు ఇంకా ఐదు రోజులే గడువుంది. ఈనెల 30న ప్రజలు తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. దీంతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అధికార బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. హ్యాట్రిక్ గెలుపుపై ధీమాతో ఉన్నా.. లోలోపల భయం వెంటాడుతోంది. ఇక కాంగ్రెస్ మాత్రం బీఆర్‌ఎస్‌ను గద్దె దించుతామన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. సర్వే సంస్థలు, న్యూమరాలజిస్టులు, జోతిష్కులు ఎవరి అభిప్రాయం వారు వెల్లడిస్తున్నారు.
కాంగ్రెస్‌లో గెలిస్తే బీఆర్‌ఎస్‌లో చేర్చుకోరట..
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన కేసీఆర్.. తనకు పూర్తి మెజారిటీ వచ్చినా.. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తన కూటిలో చేర్చుకున్నారు. ఎవరి దొడ్డిలో కడితే ఏంటి.. తన దొడ్డిలో ఈనితే చాలు అన్నట్లు వ్యవహరించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. 2018 ఎన్నికల తర్వాత అయితే టీడీపీని కనుమరుగు చేశారు. కాంగ్రెస్‌ను పూర్తిగా బలహీనపర్చారు. కానీ ఈసారి గులాబీ బాస్‌కు జ్ఞానోదయం అయినట్లు కనిపిస్తోంది. ఏపీ ఎన్నికల్లో దేవుడు స్క్రిప్టు రాసినట్లు.. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అదే స్క్రిప్టు రాస్తాడని ఆందోళన చెందుతన్నారు. 2018 కాంగ్రెస్ నుంచి లాక్కున 12 మందే ఈసారి బీఆర్‌ఎస్ నుంచి గెలుస్తారేమో అన్న టెన్షన్ గులాబీ బాస్‌లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి తాము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నుంచి గెలిచిన వారిని బీఆర్‌ఎస్‌లో చేర్చుకోబోమని ముందే ప్రకటించారు.
మంచిర్యాల సభలో..
కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకునేది లేదని కేసీఆర్ చెబుతున్నారు. మంచిర్యాల బహిరంగసభలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న ప్రేమ్‌సాగర్‌రావు తాను గెలిచినా బీæఆర్‌ఎస్‌లోకి వెళ్తానని ప్రచారం చేసుకుంటూం తమ పార్టీ ఓట్లు కూడా ఆయనకే వేయమని అడుగుతున్నారని .. ఆయనను తమ పార్టీలోకి చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు. ఆయననే కాదు కాంగ్రెస్ తరఫున గెలిచిన వాళ్లెవరినీ చేర్చుకునేది లేదని చెబుతున్నారు. ఎన్నికల తరవాత కాంగ్రెస్ నేతల్ని చేర్చుకుంటారా లేదా అన్నదానిపై స్పష్టత వస్తుంది.
మెజారిటీ రాకుంటే..
తెలంగాణలో హంగ్ వస్తుందన్న అంచానలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోమని పేర్కొనడం ఆసక్తిగా మారింది. అంటే హంగ్ వస్తే.. ఈసారి బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ–బీఆర్‌ఎస్ మధ్య అవగాహన ఉందన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ–బీఆర్‌ఎస్ మైత్రికి సంకేతమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ నేతల ప్రచారం..
గత అనుభవాల దృష్ట్యా బీఆర్‌ఎస్ ఓట్లకు గండి పెట్టేందుకు కాంగ్రెస్ అభ్యర్థులు వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాము గెలిచాక బీఆర్‌ఎస్‌లోనే చేరుతామని, ఆ పార్టీ ఓటర్లను ముందుగానే కాంగ్రెస్‌కు ఓటేసేలా చేసుకునే ప్రయత్నాలను కొంత మంది చేయడం బీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఇబ్బందిగా మారుతోంది. కాంగ్రెస్ మెజార్టీ వస్తే ఒక్కరూ ఆ పార్టీని వీడరు. ఇలా అందరూ బీఆర్‌ఎస్‌లో చేరే వారే కదా అని తమ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తే మొదటికే మోసం వస్తుందని కేసీఆర్ కంగారు పడుతున్నారు. అందుకే నేరుగా ఇదే విషయాన్ని ప్రచార సభల్లో ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Kcr said that mlas who won from congress party should be included in brs
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com