KCR- Chandrababu: ఏవరైనా తనను మించిపోతున్నాడని తెలిసినా.. తను చీట్ చేస్తున్నాడని తెలిసినా సహించని రాజకీయ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. తన ఎదుగుదల కోసం ఎంతో మందిని తొక్కిన పొలిటీషియన్.. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌లో నంబర్ 2 పొజిషల్‌కు ఎదిగిన ఎంతో మందిని తీసి అవతల పడేశారు. తన ముక్కుసూటి మాటలతో ప్రత్యర్థి ఎంతటి వారైనా సరే చీల్చి చెండాడుతారు. కనుసైగతో ఎవరు ఎలాంటి వారు గుర్తించే కేసీఆర్ మాత్రం ఆయన చేతిలో మోసపోయరట. నిజమే.. ఈవిషయం ఆయనే స్వయంగా చెప్పారు. ఆయనను మోసం చేసింది ఎవరో కాదు.. ఆయన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడే..
ఏం జరిగిందంట అంటే..
24 ఏళ్ల క్రితం తను ఒక్కడినే బయలుదేరి వెళ్లానని, తన మిత్రులతో కలిసి మన బతుకు ఇంతేనాన్ని బాధపడే వాళ్లమని కేసీఆర్ తెలిపారు. మంజీరా నది ఎండిపోయి 800 ఫీట్ల లోతుకు బోర్ వేసిన నీళ్లు రాలేకపోయేవని అన్నారు. అప్పుడు ట్రాన్సా్ఫర్మర్లు కాలిపోతే ఒక్కొక్క ట్రాన్సా్ఫర్మర్ బాగు చేయించుకోవడానికి చాలా ఇబ్బందులు పడేవాళ్లమని చెప్పారు. ఈ క్రమంలో 27 మంది ఎమ్మెల్యేల సంతకాల చేయించుకుని ఎన్టీఆర్ దగ్గరికి వెళ్తే, అప్పటి విద్యుత్ సంస్థలన్నీ ఒప్పుకున్నాయి కానీ స్లాబ్ మాత్రం చేంజ్ చేయమని అన్నారు. ఆనాడు కరెంట్ బిల్లు పెంచమని చెప్పి చంద్రబాబు నాయుడు మోసం చేశారని విమర్శించారు. ఇక చూస్తూ కూర్చుంటే లాభం లేదని తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లుగా తెలియజేశారు. తెలంగాణ కోసం తన ప్రాణాల సైతం ఇవ్వడానికి సిద్ధపడే ముందుకు దిగానని అన్నారు. కొంతమందితో కలిసి ఉద్యమానికి శ్రీకారం చుడుతూ ముందుకొచ్చిన ఎవరూ తనతో కలిసి రాలేదని,నేను వస్తే కూడా జారుకున్నారని తెలిపారు. చివరికి పోరాటాలు చేసి తెలంగాణను సాధించుకున్నామని తెలిపారు.
గజ్వేల్ నేతలతో సమావేశం..
ఈసారి ఎన్నికల్లో గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన గజ్వేల్ నేతలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మోసం గురించి వ్యాఖ్యానించారు. మరోవైపు తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రాబోతున్నామని ప్రకటించారు. 95 నుంచి 105 సీట్లు వస్తాయని తెలిపారు. గజ్వేల్‌లో తాను గెలుస్తానని, మెజారిటీ మాత్రం మీ దయ అని పేర్కొన్నారు.