ఈటలను మంత్రివర్గం నుంచి తీసేసిన కేసీఆర్

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పదవి నుంచి ఈటలను తొలగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై కు సిఫార్సు చేయగా.. ఆమె ఆమోదం మేరకు ఈటలకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పదవి పోయింది. ఆ తప్పించిన వైద్యఆరోగ్యశాఖను కేసీఆర్ కు కేటాయిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే మొత్తంగా మంత్రి ఈటల రాజేందర్ మంత్రి పదవి ఊస్ట్ అయినట్టే లెక్క. తెలంగాణలో మంత్రి ఈటల రాజేందర్ రైతుల భూకబ్జా చేశారని […]

Written By: NARESH, Updated On : May 1, 2021 2:40 pm
Follow us on

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పదవి నుంచి ఈటలను తొలగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై కు సిఫార్సు చేయగా.. ఆమె ఆమోదం మేరకు ఈటలకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పదవి పోయింది.

ఆ తప్పించిన వైద్యఆరోగ్యశాఖను కేసీఆర్ కు కేటాయిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే మొత్తంగా మంత్రి ఈటల రాజేందర్ మంత్రి పదవి ఊస్ట్ అయినట్టే లెక్క.

తెలంగాణలో మంత్రి ఈటల రాజేందర్ రైతుల భూకబ్జా చేశారని కేసీఆర్ సర్కార్ విచారణ మొదలు పెట్టింది. మెదక్ కలెక్టర్ విచారణ జరుపగా అసైన్డ్ భూమిని మంత్రి ఈటల రాజేందర్ కబ్జా చేశారని తేలింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా మంత్రి ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

ఈటల మంత్రి పదవి పోయినట్టైంది. ఈటలతోపాటు మరికొందరు మంత్రులపై కూడా వేటు పడుతుందనే ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో సాగుతోంది. కేసీఆర్ కేబినెట్ విస్తరణలో ఎంతలేదన్న ఐదుగురు మంత్రుల పోస్టులు గల్లంతు కావడం ఖాయమన్న ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.