అపెక్స్ కౌన్సిల్ లో కేసీఆర్ టార్గెట్ ఇదే…!

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సై అంటే సై అంటున్నారు. ఇక జరగబోయే అపెక్స్ కౌన్సిల్ భేటీ కు సంబంధించి కేసీఆర్ పక్కా వ్యూహాత్మకంగా సిద్ధం అయ్యాడని తెలుస్తోంది. ఇప్పటికే క్రితంసారి అపెక్స్ కౌన్సిల్ భేటీకి జగన్ సిద్ధమైన తర్వాత కూడా కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్ ఉంది అన్న సాకుతో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వాయిదా వేయించడం చూశాం. అప్పటికీ కేసీఆర్ కు ఈ మీటింగ్ పై ఎలాంటి […]

Written By: Navya, Updated On : August 25, 2020 10:27 am
Follow us on

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సై అంటే సై అంటున్నారు. ఇక జరగబోయే అపెక్స్ కౌన్సిల్ భేటీ కు సంబంధించి కేసీఆర్ పక్కా వ్యూహాత్మకంగా సిద్ధం అయ్యాడని తెలుస్తోంది. ఇప్పటికే క్రితంసారి అపెక్స్ కౌన్సిల్ భేటీకి జగన్ సిద్ధమైన తర్వాత కూడా కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్ ఉంది అన్న సాకుతో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వాయిదా వేయించడం చూశాం. అప్పటికీ కేసీఆర్ కు ఈ మీటింగ్ పై ఎలాంటి అవగాహన, ముందస్తు ప్రిపరేషన్ లేకపోయాయి.

Also Read : అమరావతి విషయంలో బాబు వ్యూహం…. మొదటికే మోసం?

అయితే గత కొద్ది రోజులుగా కేసీఆర్ వరుస క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తూ తన అధికారులకు అపెక్స్ కౌన్సిల్ విషయమై పూర్తి వివరాలను అందిస్తున్నాడు. అక్కడ జగన్ కి ధీటుగా చెప్పవలసిన పాయింట్లు ఇంకా తమ ప్రాజెక్టు విషయమై లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేస్తూ అవతల వారిని నోరెత్తనివ్వకుండా చేయాల్సిన విషయం గురించి కెసిఆర్ పదేపదే గుర్తు చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే జగన్ నేరుగా తెలంగాణలో కట్టబడిన ప్రాజెక్టులన్నీ అక్రమమైన అని మాట్లాడటం…. వారి వద్ద ఏది సరిగ్గా ఉండదు అని వ్యాఖ్యానించడం కెసిఆర్ ఇగో నీ భారీగా హార్ట్ చేసింది.

ఇదే సమయంలో పనిలో పనిగా కేంద్రంపై కూడా కేసీఆర్ ఒకేసారి సమయంలో పగ తీర్చుకోవాలని భావిస్తున్నాడు. శ్రీశైలం వంటి ప్రాజెక్టులపై కేంద్రం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుందని ఆరోపిస్తున్న కేసీఆర్ మీటింగ్ లో మీరు జగన్ కి వత్తాసు పలుకుతున్నారు అని వారిని నిలదీసేసేస్తాడని టిఆర్ఎస్ పార్టీ వర్గాల సమాచారం. అయితే అటువైపు నుండి జగన్ కూడా ఏమీ తక్కువ తినలేదు. క్రితంసారి జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కే అతను పూర్తిగా సన్నద్ధమై ఆధారాలతో సహా రెడీగా ఉన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల వచ్చిన ఈ ప్రాబ్లం యొక్క పరిష్కారానికి ఎలా తనవైపుకి ఎప్పుకోవాలో అతనికి కూడా తెలుసు అని వైసిపి వర్గాలు అధికారులు ఎంతో నమ్మకంగా ఉన్నారు. మరి వీరిద్దరిలో పైచేయి ఎవరిది?

Also Read : జగన్ మరో సంచలనం.. అంతా షేక్ అవుతున్నారా?