https://oktelugu.com/

అమరావతి విషయంలో బాబు వ్యూహం…. మొదటికే మోసం?

అమరావతి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఒక మాట…. ఎన్నికల తర్వాత మరొక మాట చెబుతుందని ఎప్పటినుండో ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు ఇక పరిస్థితి చేయి దాటిపోతుంది అనుకుంటున్న తరుణంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే ప్రజాతీర్పు కోరాలని కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్న చంద్రబాబు…. ప్రజల మద్దతు అమరావతికే ఉందని పూర్తిస్థాయిలో నమ్ముతున్నారు. అయితే ఈ విషయంపై వైసిపి నుండి ఎలాంటి స్పందన కనిపించలేదు. కానీ ప్రజా తీర్పుకి మాత్రం వెళ్లే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 25, 2020 9:35 am
    Follow us on

    అమరావతి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఒక మాట…. ఎన్నికల తర్వాత మరొక మాట చెబుతుందని ఎప్పటినుండో ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు ఇక పరిస్థితి చేయి దాటిపోతుంది అనుకుంటున్న తరుణంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే ప్రజాతీర్పు కోరాలని కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్న చంద్రబాబు…. ప్రజల మద్దతు అమరావతికే ఉందని పూర్తిస్థాయిలో నమ్ముతున్నారు. అయితే ఈ విషయంపై వైసిపి నుండి ఎలాంటి స్పందన కనిపించలేదు. కానీ ప్రజా తీర్పుకి మాత్రం వెళ్లే అవసరం కూడా వైసిపికి ప్రస్తుతం లేదనే చెప్పాలి. అంతేకాకుండా తాము రాజీనామాలు కూడా చేయబోమని వైసీపీ నేతలు ఇప్పటికే తేల్చేశారు.

    Also Read : జగన్ ను చావు దెబ్బ కొట్టేందుకు కేసీఆర్ రె’ఢీ’..!

    ఇక ఇలాంటి సమయంలో వైసీపీ పై మరింత ఒత్తిడి పెంచేందుకు చంద్రబాబు ప్రజాభిప్రాయాన్ని వెల్లడించే వేదికను ప్రారంభించారు. www.apwithamaravthi.com అనే పేరుతో ఒక వెబ్సైట్ ను ప్రారంభించారు. 13 జిల్లాల ప్రజలు ఏపీ రాజధానిగా ప్రజలు అమరావతినే కోరుతున్నారా…. లేదా అనే విషయాన్ని ఈ వెబ్సైట్ ద్వారా తెలియజేయవచ్చని చంద్రబాబు చెబుతున్నారు. వాస్తవానికి అమరావతి విషయంలో ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉందని జాతీయ మీడియా తో పాటు సోషల్ మీడియాలో వైసిపి ఫ్యాన్స్ పెట్టిన పోస్టుల్లో కూడా తేటతెల్లమైంది. దాదాపు అందరూ అమరావతి కి మద్దతు పలుకుతున్నారని… ప్రాంతాలకు అతీతంగా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను అందరూ గుర్తించాలని టిడిపి నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతో ధైర్యంగా వారు ఇప్పుడు ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఒక వెబ్సైట్ ని ప్రారంభించారు.

    అయితే జగన్ సర్కార్ ఇప్పటివరకు ప్రజాభిప్రాయం అనే పదం ఎక్కడా వాడలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఒకటి మొదలు పెట్టాడు కనుక కచ్చితంగా దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పవర్ లో ఉన్న గవర్నమెంట్, అత్యంత ప్జాదరణ కలిగిన జగన్ వెబ్ సైట్ రిజల్ట్స్ ను తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లు ఎక్కువ ఓట్లు కూడా అమరావతి కి వ్యతిరేకంగా పడేలాగా సన్నాహాలు జరుగుతున్నాయట. అందులో వైసీపీ విజయం సాధిస్తే చంద్రబాబు నోరు పర్మినెంట్ గా వైసిపి వారు మూసివేయవచ్చు. అంతేకాకుండా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో సన్నాహాలు జరుగుపుతున్నారట లోకల్ వైసీపీ నేతలు. ఇది సక్సెస్ అయితే ఓటింగ్ లో అమరావతికి వ్యతిరేకంగా భారీగా ప్రజలు విశాఖకు మద్దతు తెలిపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక అదే జరిగితే బాబు ప్లాన్ వల్ల తెదేపా పార్టీకి మొదటికే మోసం వస్తుంది. మరి చూద్దాం ఏమవుతుందో.

    Also Read : జగన్ మరో సంచలనం.. అంతా షేక్ అవుతున్నారా?