https://oktelugu.com/

బీజేపీపై పోరుకు కేసీఆర్‌‌ రెడీ.. ప్లాన్ ఏంటి?

అదేంటో ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ అర్థం కాదు. కేంద్రంతో ఎప్పుడు దోస్తానా అంటాడో.. ఎప్పుడు ఫైటింగ్‌కి దిగుతాడో కూడా తెలియదు. ఇక ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో మరోసారి బీజేపీపై ఫైర్‌‌ అవుతున్నారు. కేంద్ర సర్కార్‌‌ను నిలదీయాలని పిలుపునిస్తున్నాడు. ప్రాంతీయ పార్టీలను కూడగట్టుకొని భవిష్యత్తులో కేంద్రంపై పోరాడేందుకు సిద్ధపడుతున్నాడు. Also Read: కేసీఆర్, జగన్ ల మధ్య బీజేపీ చిచ్చు! జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నిన్న […]

Written By:
  • NARESH
  • , Updated On : November 19, 2020 / 10:36 AM IST
    Follow us on

    అదేంటో ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ అర్థం కాదు. కేంద్రంతో ఎప్పుడు దోస్తానా అంటాడో.. ఎప్పుడు ఫైటింగ్‌కి దిగుతాడో కూడా తెలియదు. ఇక ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో మరోసారి బీజేపీపై ఫైర్‌‌ అవుతున్నారు. కేంద్ర సర్కార్‌‌ను నిలదీయాలని పిలుపునిస్తున్నాడు. ప్రాంతీయ పార్టీలను కూడగట్టుకొని భవిష్యత్తులో కేంద్రంపై పోరాడేందుకు సిద్ధపడుతున్నాడు.

    Also Read: కేసీఆర్, జగన్ ల మధ్య బీజేపీ చిచ్చు!

    జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ హఠాత్తుగా టీఆర్ఎస్ ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహించాడు. బీజేపీని తక్కువగా అంచనా వేయకూడదని నిర్ణయించాడు. బీజేపీని ఎలా ఎదుర్కోవాలో అందరికీ చెప్పి పంపించాడు. జాతీయ స్థాయి నుంచి స్థానిక స్థాయి వరకూ బీజేపీని ఎలా ఎదుర్కోవాలో ప్రణాళికను కూడా ప్రకటించారు. జాతీయస్థాయిలో డిసెంబర్ రెండో వారంలో బీజేపీ వ్యతిరేక పార్టీల సమావేశం నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం పరిశ్రమలన్నింటినీ అమ్మేస్తోందని..కార్మికులందరినీ రోడ్డున పడేస్తోందని.. వారందరినీ ఆదుకోవాలంటే.. బీజేపీపై దేశవ్యాప్త పోరాటం తప్పనిసరి అని కేసీఆర్ అన్నారు.

    డిసెంబర్ రెండోవారంలో తన ఆధ్వర్యంలో నిర్వహించబోయే బీజేపీ వ్యతిరేక పార్టీల సమావేశానికి మమతా బెనర్జీ, కుమారస్వామి, అఖిలేష్ యాదవ్, స్టాలిన్, మాయావతి హాజరవుతున్నారని ఎంపీలు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ తెలిపారు. సమావేశం మొత్తంగా బీజేపీపై విరుచుకుపడ్డారు కేసీఆర్‌‌. బీజేపీపై హైదరాబాద్‌ నుంచే యుద్ధం మొదలవుతుందని ప్రకటించారు. అంతేకాదు.. దుబ్బాకలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామంటూ గతంలో ప్రకటించిన కేసీఆర్‌‌.. ఈసారి జీహెచ్‌ఎంసీ సర్వేలపై వెల్లడించారు. 105 సీట్లు గెలుస్తామంటూ మాట్లాడుకొచ్చారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని మైండ్ నుండి తీసేయాలని.. ఇన్నాళ్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రేటర్‌లో చేసిన అభివృద్ధితో పాటు.. కరోనా, వరదల్లో వ్యవహరించిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్‌ ప్రజాప్రతినిధులకు సూచించారు.

    Also Read: బీజేపీ అసలు టార్గెట్ అదేనా

    బీజేపీ విమర్శలను.. అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని.. సోషల్‌ మీడియాతో సహా అన్ని వేదికలపై కౌంటర్లు ఇవ్వాలని కేసీఆర్ అందరికీ దిశానిర్దేశం చేశారు. దీనికితోడు కేసీఆర్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ చేసిన ఫిర్యాదుతోనే వరద సాయం పంపిణీకి ఈసీ బ్రేక్ వేసిందని ఆరోపించారు. బండి సంజయ్.. లేఖ రాయడం వల్లనే ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకున్నారని కేసీఆర్ మండిపడ్డారు. పేదల పొట్ట కొట్టారని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలపై బండి సంజయ్ మండిపడ్డారు. తాను ఎలాంటి లేఖ రాయలేదని.. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ నిజమైన హిందువే అయితే.. తాను లేఖ రాసినట్లుగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలన్నారు. మొత్తానికి తెలంగాణలో ఇన్నాళ్లు కాంగ్రెస్‌ ప్రత్యర్థిగా అనుకున్న టీఆర్‌‌ఎస్‌కు ఇప్పుడు బీజేపీ పక్కలో బల్లెంలా తయారైంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్