https://oktelugu.com/

KCR Politics : ‘ముందస్తు’కు కేసీఆర్.. మళ్లీ అధికారం కొడతాడా? పడతాడా?

KCR Politics : ఊరికే పెట్టరు మహానుభావులు అని.. తెలంగాణ సీఎం కేసీఆర్ ‘మునుగోడు’ ఉప ఎన్నిక తర్వాత వచ్చిన జోష్ తో రేపు టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు అందరినీ పిలిపించి శూలశోధన మొదలుపెడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళితే టీఆర్ఎస్ కు విజయం దక్కుతుందన్న ఆశ కేసీఆర్ లో ఏర్పడింది. అందుకే ముందస్తు ఎన్నికల కోసం వెళుతున్నట్టుగా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఈనెల 15న రేపు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 14, 2022 / 11:41 AM IST
    Follow us on

    KCR Politics : ఊరికే పెట్టరు మహానుభావులు అని.. తెలంగాణ సీఎం కేసీఆర్ ‘మునుగోడు’ ఉప ఎన్నిక తర్వాత వచ్చిన జోష్ తో రేపు టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు అందరినీ పిలిపించి శూలశోధన మొదలుపెడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళితే టీఆర్ఎస్ కు విజయం దక్కుతుందన్న ఆశ కేసీఆర్ లో ఏర్పడింది. అందుకే ముందస్తు ఎన్నికల కోసం వెళుతున్నట్టుగా పరిణామాలను బట్టి తెలుస్తోంది.

    ఈనెల 15న రేపు మంగళవారం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. మునుగోడులో పాజిటివ్ ఫలితం రావడం.. కేంద్రంలోని మోడీ సర్కార్ వెంటాడుతుండడంతో ఈ సెంటిమెంట్ ను ఎలాగైనా రాజేసి తెలంగాణలో మరోసారి అధికారం సాధించడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

    టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్న నేపథ్యంలో కీలక సమాలోచనలకు ఈ మీటింగ్ వేదిక కాబోతోంది. దేశవ్యాప్తంగా ఇన్ చార్జులు, వ్యూహాలు ఎలా ముందుకెళ్లాలన్న  దానిపై కేసీఆర్ ప్లాన్ రెడీ చేయడానికి ఈ మీటింగ్ ను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.

    తెలంగాణలో 2023లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఇంకో ఏడాది మాత్రమే సమయం ఉంది.ఇప్పుడు అసెంబ్లీ రద్దు చేసినా 6 నెలలలోపు నిర్వహిస్తారు. అంటే ఒక 6 నెలలు మాత్రమే కేసీఆర్ కు అధికారం దూరమవుతారు. అధికారం వస్తుందంటే అది పెద్ద విషయం కాదు. అసెంబ్లీ ఎన్నికల వరకూ బీజేపీ బలం పుంజుకోకముందే.. ఇప్పుడే దెబ్బతీయాలని కేసీఆర్ కాచుకు కూర్చున్నారు.

    ముందస్తు ఎన్నికలకు వెళితే గెలుస్తామా? లేదా?అన్న దానిపై సర్వే రిపోర్టులు, ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకొని ముందుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పుడు గెలిచాక సార్వత్రిక ఎన్నికలు 2024లో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించి జాతీయ పార్టీగా రూపుదిద్దుకోవచ్చని ఆయన భావిస్తున్నారు. మరి ఈ ప్లాన్లు వర్కవుట్ అవుతాయా? లేవా? అన్నది వేచిచూడాలి.