Eesha Rebba: సినిమా ఆఫర్స్ లేని ఈషా రెబ్బా కూలి పనికి వెళ్లింది. భవన నిర్మాణ కార్మికురాలిగా మారింది. ఈషా రెబ్బా పరిస్థితి చూసిన నెటిజెన్స్ బాధపడుతున్నారు. ఈషా రెబ్బా ఏంటి? కూలి పనులకు వెళ్లడమేంటి? అని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. మీరనుకున్నది నిజమే. ఈషా రెబ్బా నిజంగా కూలీగా మారలేదు. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ అలా సాగింది. హాట్ ట్రెండీ వేర్ ధరించిన ఈషా రెబ్బా మాస్ బ్యాక్ గ్రౌండ్ లో ఫోటో షూట్ చేశారు. ఇటుకరాళ్ల ప్రక్కన, పురాతన వీధుల్లో నిల్చొని ఫోజులిచ్చారు. ఈషా రెబ్బా లుక్, బ్యాగ్రౌండ్ చూసిన నెటిజెన్స్ ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తున్నారు.

ఎవరైనా ఇలాంటి బట్టల్లో కూలి పనికి వెళ్తారా? అని ఒకరు కామెంట్ పెడితే, మరొకరు ఆ ఇటుక రాళ్ల కంపెనీ వాడికి ఫ్రీగా పబ్లిసిటీ దక్కిందని సెటైర్ వేశాడు. పాపం సినిమా ఆఫర్స్ లేని ఈషా కూలి పనులకు వెళుతుందని ఎద్దేవా చేస్తున్నారు. ఏది ఏమైనా ఈషాకు మాత్రం సదరు ఫోటో షూట్స్ కారణంగా మంచి ప్రచారం వచ్చింది. దీంతో అవి వైరల్ గా మారాయి.

బాలీవుడ్ రేంజ్ ఫిగర్, గ్లామర్ ఉన్నప్పటికీ ఈషాకు కాలం కలిసి రాలేదు. తాటికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం లేకపోతే పరిశ్రమలో రాణించడం కష్టం. ఆ లక్ అనేది ఈషా రెబ్బాకు ముఖం చాటేసింది. ఫేట్ మార్చే ఒక్క హిట్ ఈషాకు పడలేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈషా రెబ్బా పదేళ్ల జర్నీ పూర్తి చేసుకుంది. ఇన్నేళ్లలో పలు చిత్రాల్లో నటించినా ఎలాంటి గుర్తింపు రాలేదు.

ఈషా రెబ్బా కెరీర్లో ‘అ’, అరవింద సమేత వీర రాఘవ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. అయితే వీటిలో ఈషా రెబ్బా ప్రాధాన్యత లేని పాత్రలు చేశారు. ‘అ ‘ మూవీలో కొంచెం స్క్రీన్ స్పేస్ ఉన్న పాత్ర దక్కింది. తెలుగులో ఈషా కెరీర్ దాదాపు ముగిసినట్లే. అధికారికంగా ఆమె ఒక్క ప్రాజెక్ట్ ప్రకటించలేదు.
దీంతో మలయాళ, కన్నడ పరిశ్రమల్లో కెరీర్ వెతుక్కుంటుంది. ఈషా నటించిన మలయాళ చిత్రం ఒట్టు ఇటీవల విడుదలైంది. ఈ మూవీ చెప్పుకోదగ్గ స్థాయిలో విజయం సాధించలేదు. ఈషా హీరోయిన్ గా అయిరన్ జన్మంగళ్ అనే తమిళ చిత్రం తెరకెక్కుతుంది. కనీసం కోలీవుడ్ లో అయినా ఈషాకు బ్రేక్ వస్తుందేమో చూడాలి.


