TRS Plenary Food Menu: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్లీనరీని ప్రతిష్టాత్మకంా నిర్వహించనుంది. ఈ మేరకు మాదాపూర్ లోని హెచ్ ఐసీసీలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వచ్చే అతిథుల కోసం బహిరంగ సభ, భోజన ఏర్పాట్లు పూర్తి చేశారు. నోరూరించే వంటకాలు సిద్ధం చేశారు. 33 రకాల వంటకాలతో అతిథులు వారెవ్వా అనేలా విందు ఏర్పాట్లు ఉన్నాయి. ప్లీనరీని అంగరంగ వైభవంగా నిర్వహించేలా ప్లాన్ చేశారు. బుధవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యే ప్లీనరీలో పలు తీర్మానాలు చేస్తారని వార్తలు వస్తున్నాయి.

టీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లీనరీ నిర్వహించేందుకు కేసీఆర్ ప్రణాళికలు రచించారు. అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు రానుండటంతో నగరం అంతా గులాబీమయం కానుంది. చుట్టుపక్కల ప్రాంతాలు పార్టీ జెండాలతో ముస్తాబయ్యాయి. ఎటు చూసినా గులాబీ జెండాలే కనిపిస్తున్నాయి. దీంతో నగరం మొత్తం గులాబీ శోభితంగా మారిపోయింది. ప్లీనరీకి వచ్చే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నోరూరించే వంటకాలు సిద్ధం చేస్తున్నారు. దీంతో భోజన ప్రియులకు మాత్రం జిహ్వ చాపల్యం చూపాల్సిందే.
హెచ్ఐసీసీలో ఉదయం 11 గంటలకు అమరవీరుల స్తూపానికి నివళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దాదాపు మూడు వేల మందికి ఆహ్వానాలు ఉన్నాయి. బార్ కోడ్ తో కూడిన పాసులను జారీ చేశారు. దీంతో ఇందులో 11 అంశాలతో కూడిన తీర్మానాలు ఉంటాయని తెలుస్తోంది. వీటిని కేసీఆర్ ప్రవేశపెట్టి ఆమోదించేందుకుకు అందరి సమ్మతి అడుగుతారు.

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ కొన్ని కీలక ప్రకటనలు చేయనున్నారని తెలుస్తోంది. భవిష్యత్ లో ఎన్నికలు సమీప్తుండటంతో పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కేసీఆర్ ప్రజాకర్షక పథకాల అమలుకు శ్రీకారం చుట్టనున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే రేపు జరగబోయే ప్లీనరీలో కేసీఆర్ పలు రకాల ప్రకటనలు చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
శాఖాహారాలతో పాటు మాంసాహారాలు అతిథులను ఆకట్టుకోనున్నాయి. కేసీఆర్ చూడ్డానికి పక్కపలుచని వ్యక్తి అయినా భోజన ప్రియుడే. దీంతో వచ్చే వారందరికి నోరూరించే వంటకాలు సిద్ధం చేయించారు. దీంతో వచ్చిన వారు లొట్టలేసుకుని తినడమే తరువాయి.
Also Read:Ruia Hospital: దేవుడా..! ఆస్పత్రిలో ఘోరం.. పసివాడి ప్రాణం పోయినా కనికరించరా..?
[…] Prashant kishor: అనుకున్నదే అయింది. కాంగ్రెస్ కు పెద్ద షాకే తగిలింది. ఇన్నాళ్లు ఊరిస్తూ వచ్చిన పీకే చేరిక ఇక లేదని తేలిపోయింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలో పడ్డారు. ఇప్పటి దాకా తమ పార్టీకి పీకే వ్యూహాలు పనిచేస్తాయి. రాబోయే కాలంలో తామే చక్రం తిప్పుతామని భావించినా అదంతా వట్టిదే అని తేలిపోయింది. దీంతో ఇక కాంగ్రెస్ కు దిక్కు లేకుండా పోయింది. వచ్చే ఎన్నికల్లో పార్టీ భవితవ్యం డోలాయమానంలో పడనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఏం నిర్ణయాలు తీసుకుంటుందో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. […]
[…] […]
[…] TRS Plenary: అసలు ఉనికి లేని తెలంగాణకు ఒక ఉద్యమ పంథాతో అలజడి రేపింది తెలంగాణ రాష్ట్రసమితి. కేసీఆర్ లాంటి బక్కపలుచని ఒక నేత ఒక్కడితో మొదలైన ఈ పార్టీ ప్రస్థానం.. స్వరాష్ట్రం సాధించి తొలి ముఖ్యమంత్రి అయ్యి అభివృద్ధి బాటలో పయనించే వరకూ సాగింది. టీఆర్ఎస్ పుట్టి నేటికి 21 ఏళ్లు. అసలు కలలో కూడా ఊహించని విజయాలను సాధించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 21 ఏళ్ల క్రితం జలదృశ్యంలో పిడికెడు మందితో ప్రారంభించిన టీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణ సాధించిన పార్టీగా అవతరించింది. ఇప్పుడు తెలంగాణ టు ఢిల్లీకి అడుగులు వేస్తోంది. […]
[…] TRS Plenary Resolutions: హుజూరాబాద్ ఎన్నికల తర్వాత కమలం పార్టీ కేసీఆర్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలతో తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారని పార్టీలో ఓ టాక్. ఎనిమిదేళ్ల పాలనలో ఈ ఏడాదిగా నిర్వహించిన పొలిటికల్ ప్రెస్‌మీట్లు ఎన్నడూ పెట్టలేదు. గతంలో ప్రగతభవన్, ఫామ్‌హౌస్ వీడి బయటకు వచ్చి ప్రజలు, నిరుద్యోగుల గురించి కేసీఆర్ ఆలోచించిన సందర్బాలు చాలా తక్కువ. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు ముఖ్యమంత్రిని ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చాయనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఏడేళ్లు కేంద్రంలోని బీజేపీతో సాన్నిహిత్యం కొనసాగించిన కేసీఆర్.. హుజూరాబాద్ ఫలితం తర్వాత మేల్కొన్నారు. బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. రైతుల సమస్యను అడ్డం పెట్టుకుని గత వానాకాలం నుంచి పెద్ద యుద్ధమే చేస్తున్నారు. అయితే వరి యుద్ధంలో భారీ విజయం సాధిస్తానని అనుకున్న కేసీఆర్‌కు నిరాశే మిగిలింది. చి‘వరి’కి రైతులే గెలిచారు. ఈ నేపథ్యంలో 2024 జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని చిత్తు చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పంచన చేరారు. శని, ఆదివారాల్లో ఆయనతో భేటీ నిర్వహించిన కేసీఆర్ సుదీర్ఘ మంతనాల తర్వాత టీఆర్‌ఎస్ ప్లీనరీలో చేయాల్సిన 13 తీర్మానాలకు రూపకల్పన చేశారు. […]