https://oktelugu.com/

కేసీఆర్ కి కొత్త అర్థం చెప్పిన కేటిఆర్

  రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌.. కేసీఆర్‌ కు కొత్త నిర్వచనమిచ్చారు. “కే… అంటే కాల్వలు, సీ… అంటే చెరువులు, ఆర్‌… అంటే రిజర్వాయర్లు” అని కేటీఆర్‌ తెలిపారు. కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభం సందర్భంగా కేటిఆర్ ఈ ట్వీట్ చేశారు. తెలంగాణను సస్యశ్యామలం చేసే విధంగా కేసీఆర్ సర్కార్ ముందుకెళ్తున్నారు. గోదావరి, కృష్ణా జలాలను ఒడిసిపట్టి.. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే విధంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా గోదావరి జలాలను ఒడిసి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 29, 2020 1:55 pm
    Follow us on

     

    రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌.. కేసీఆర్‌ కు కొత్త నిర్వచనమిచ్చారు.
    “కే… అంటే కాల్వలు,
    సీ… అంటే చెరువులు,
    ఆర్‌… అంటే రిజర్వాయర్లు”
    అని కేటీఆర్‌ తెలిపారు. కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభం సందర్భంగా కేటిఆర్ ఈ ట్వీట్ చేశారు.

    తెలంగాణను సస్యశ్యామలం చేసే విధంగా కేసీఆర్ సర్కార్ ముందుకెళ్తున్నారు.
    గోదావరి, కృష్ణా జలాలను ఒడిసిపట్టి.. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే విధంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా గోదావరి జలాలను ఒడిసి పట్టేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి.. ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగమైన తుది పంపు హౌజ్ మర్కూక్ పంపు హౌజ్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మెతుకు సీమను సస్యశ్యామలం చేసేందుకు కొండపోచమ్మ సాగర్ ను సీఎం ప్రారంభించి.. గోదావరి జలాలకు హారతి పట్టారు. రైతులకు సాగునీరు అందిస్తున్న కేసీఆర్ పై రాష్ర్ట వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

    ఈ క్రమంలో కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతుండటంతో కేసీఆర్‌ పేరు సార్థకమైందన్నారు‌. సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తున ఉన్న మేడిగడ్డ నుంచి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ వరకు గోదావరి జలాలను ఎత్తిపోసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళార్ధ సాధక ప్రాజెక్టు కాళేశ్వరాన్ని యువ తెలంగాణ రాష్ర్టం.. కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసింది అని కేటీఆర్ తెలిపారు.