KCR vs Modi: ఢిల్లీ వేదికగా కేసీఆర్ పోరాటం ఫలిస్తుందా?

KCR vs Modi: వరి కొనుగోలు అంశాన్ని తెర మీదకు తెచ్చి కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీ వేదికగా పోరుబాట పట్టాలని నిర్ణయించారు. వారం రోజుల పాటు అక్కడే మకాం వేసి ఉద్యమం ఉధృతం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈపాటికే ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈనెల 11 న ఢిల్లీలో నిరసన చేపట్టేందుకు ప్రణాళిక ఖరారైంది. ఆదివారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇక అక్కడే మకాం వేసి బీజేపీ వ్యతిరేక […]

Written By: Srinivas, Updated On : April 4, 2022 8:39 am
Follow us on

KCR vs Modi: వరి కొనుగోలు అంశాన్ని తెర మీదకు తెచ్చి కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీ వేదికగా పోరుబాట పట్టాలని నిర్ణయించారు. వారం రోజుల పాటు అక్కడే మకాం వేసి ఉద్యమం ఉధృతం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈపాటికే ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈనెల 11 న ఢిల్లీలో నిరసన చేపట్టేందుకు ప్రణాళిక ఖరారైంది. ఆదివారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇక అక్కడే మకాం వేసి బీజేపీ వ్యతిరేక శక్తులను కలిసి వారితో ఉద్యమం చేయాలని భావిస్తున్నారు.

KCR vs Modi

రాబోయే రోజుల్లో బీజేపీని టార్గెట్ చేసుకుని వరి కొనే వరకు విశ్రమించబోమని ప్రకటిస్తున్నారు. కానీ కేసీఆర్ కోరిక ఫలించేనా? అనవసర ప్రయాస అని అందరు ఆశ్చర్యపోతున్నారు. కేంద్రంతో పెట్టుకుంటే ఇక అంతేసంగతి అనే వాదనలు వస్తున్నా కేసీఆర్ మాత్రం పట్టించుకోవడం లేదు. తెగే వరకు లాగేందుకు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ వెంట కవిత, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

Also Read: Movement of Maoists: బొగ్గు గని గూండాలపై మావోయిస్టుల నజర్‌?
ఇందులో భాగంగా బుధవారం 6న జాతీయ రహదారులపై రాస్తారో, గురువారం 7న జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, శుక్రవారం 8న గ్రామాల్లో కేంద్రం దిష్టిబమ్మల దహనం, ఇళ్లపై నల్లజెండాల ఎగురవేత చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. దీనికి పార్టీ శ్రేణులు అందరు రావాలని పిలుపునిచ్చారు.

ఢిల్లీలో జరగబోయే దీక్షకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, రైతుబంధు సమితి అధ్యక్షులు టీఆర్ఎస్ రాష్ట్ర సహకార సంఘాల చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు అందరు పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని అపాయింట్ మెంట్ కోరినా ఇంతవరకు ఇవ్వలేదు. కేసీఆర్ వ్యూహాలు అన్ని వట్టివేనని చెబుుతున్నారు. కేంద్రాన్ని బదనానం చేయడానికే కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది.

KCR

బీజేపీపై యుద్ధం చేస్తూనే మరోవైపు బీజేపీ వ్యతిరేక శక్తుల ఏకీకరణ సాధ్యమవుతుందా? కేసీఆర్ మాటలు ఎవరు వింటారు? ఆయనేమైనా జాతీయ నాయకుడా? లేక ఉద్యమాలు చేసిన నేతనా అని నిట్టూర్పులు విడుస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ ఢిల్లీ వేదికగా మరోసారి తన పరువు తీసుకుని వస్తారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కూట్లో రాయి ఏరలేనోడు ఏట్లో రాయి ఏరినట్లు అని అందరు అనుకుంటున్నారు.

Also Read:Bandi Sanjay: ‘డ్రగ్స్’ కేసులో ప్రమేయమున్న వారిని అరెస్ట్ చేసే దమ్ముందా?: బండి సంజయ్

Tags