https://oktelugu.com/

Shriya Saran shocking comments on NTR Charan: ఎన్టీఆర్ – చరణ్ పై శ్రియ షాకింగ్ కామెంట్స్

Shriya Saran shocking comments on NTR Charan: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అద్భుతమైన టాక్ తో ప్రస్తుతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. విపరీతమైన అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ విషయంలో దుమ్ము లేపుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలక పాత్రలో నటించిన శ్రియ ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని చూడలేదు అట. అదేమిటి ? సినిమాలో నటించిన వాళ్లే సినిమా చూడకపోతే ఎలా ? ఇదే ప్రశ్నను […]

Written By:
  • Shiva
  • , Updated On : March 31, 2022 / 02:56 PM IST
    Follow us on

    Shriya Saran shocking comments on NTR Charan: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అద్భుతమైన టాక్ తో ప్రస్తుతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. విపరీతమైన అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ విషయంలో దుమ్ము లేపుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలక పాత్రలో నటించిన శ్రియ ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని చూడలేదు అట.

    Actress Shriya Saran

    అదేమిటి ? సినిమాలో నటించిన వాళ్లే సినిమా చూడకపోతే ఎలా ? ఇదే ప్రశ్నను అడిగింది మీడియా. దానికి శ్రియ మాట్లాడుతూ… ఆర్ఆర్ఆర్ సినిమాను నేను ఇంకా చూడలేదు, నిజానికి నేను ఆర్ఆర్ఆర్ టికెట్లు కోసం ఎంత ప్రయత్నించినా టికెట్లు మాత్రం నాకు దొరకలేదు. ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి.

    Also Read: Tiger Nageswara Rao Movie New Update: ‘టైగర్ నాగేశ్వరరావు’ నుంచి క్రేజీ అప్ డేట్

    కానీ, కచ్చితంగా మా సినిమాని థియేటర్ లోనే చూస్తాను అంటూ శ్రియ చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమా పై మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేసింది. ‘నేను రాజమౌళి సినిమా అనగానే హీరో ఎవరు అని తెలుసుకోకుండానే సైన్ చేసేశాను. అప్పుడు నాకు ఈ సినిమాలో హీరోలు ఎవరో కూడా తెలియదు. అయితే.. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక, నాకు తారక్, రామ్‌చరణ్ హీరోలని తెలిసింది’ అని శ్రియ చెప్పుకొచ్చింది.

    Shriya Saran

    కాగా రాజమౌళి డైరెక్షన్‌లో గతంలో శ్రియ ఛత్రపతిలో నటించింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ జోడీగా శ్రియ నటించింది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ మేనియా ఏ రేంజ్‌లో ఉందో తెలిసిందే. రాజమౌళి మెస్మరైజింగ్‌ మ్యాజిక్‌తో మరోసారి ఇండస్ట్రీ హిట్‌ కొట్టినట్టే అంటున్నారు ట్రేడ్‌ పండితులు.

    ఈ సినిమా కోసం ప్రముఖులు సైతం ఇలా ప్రత్యేక ఆసక్తి చూపించడం గొప్ప విషయం. ఎలాగూ ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. పైగా గతంలో ఏ సినిమాకి రానివిధంగా కలెక్షన్స్ వస్తున్నాయి. అందుకే.. ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు వెండితెర పై ప్రత్యేకంగా నిలిచిపోతుంది.

    Also Read:Megastar Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న హీరోయిన్ గా, త‌ల్లిగా న‌టించింది ఎవ‌రో తెలుసా..?

    Tags