https://oktelugu.com/

KCR National Party: కేసీఆర్ మరోసారి ‘సెంటిమెంట్’ అస్త్రం: జాతీయ పార్టీ నినాదం ఇదే..

KCR National Party: ప్రాంతీయ వాదాన్ని రగల్చడంలో కేసీఆర్ దిట్ట. 1969లో మొదలైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం.. ఆ తరువాత కనుమరుగైంది. ఇక తెలంగాణ రాదనుకొని అనుకుంటున్న సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ తో మరోసారి అగ్గి రాజేశారు. మొత్తానికి ‘జై తెలంగాణ’ అంటూ సెంటిమెంట్ ను రగిల్చి ప్ర్యత్యేక రాష్ట్రాన్ని సాధించారు. ఇప్పుడు దేశంలో పాగా వేసేందుకు కేసీఆర్ కొత్త వ్యూహాన్ని రచిస్తున్నారు. అదే దక్షిణాదివాదం. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తున్నా […]

Written By:
  • NARESH
  • , Updated On : June 13, 2022 / 10:34 AM IST
    Follow us on

    KCR National Party: ప్రాంతీయ వాదాన్ని రగల్చడంలో కేసీఆర్ దిట్ట. 1969లో మొదలైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం.. ఆ తరువాత కనుమరుగైంది. ఇక తెలంగాణ రాదనుకొని అనుకుంటున్న సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ తో మరోసారి అగ్గి రాజేశారు. మొత్తానికి ‘జై తెలంగాణ’ అంటూ సెంటిమెంట్ ను రగిల్చి ప్ర్యత్యేక రాష్ట్రాన్ని సాధించారు. ఇప్పుడు దేశంలో పాగా వేసేందుకు కేసీఆర్ కొత్త వ్యూహాన్ని రచిస్తున్నారు. అదే దక్షిణాదివాదం. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తున్నా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే కాన్పెప్ట్ తో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు బలం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలన్నీంటిని ఏకం చేసి కేంద్రంపై పోరాటం చేసేలా ప్లాన్ వేస్తున్నారు. అయితే ఈ ప్రాంతీయ పార్టీలన్ని కేసీఆర్ చెప్పినట్లు నడుచుకుంటాయా..? అనే అనుమానాలున్నాయి.. ఎందుకంటే..?

    KCR

    తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయాల్లో బిజీగా మారారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించినా.. ఉన్న పార్టీనే జాతీయ పార్టీగా మార్చేదుకు ప్రణాళిక వేస్తున్నారు. ఇప్పుడున్న టీఆర్ఎస్ ను భారత రాజ్య సమితి(బీఆర్ఎస్)గా మార్చాలని అనుకుంటున్నారు. ఈనెల 19న ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నారు. తాజాగా ఆయన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో సమావేశమై జాతీయ పార్టీ గురించి చర్చించినట్లు సమాచారం. ఇదే సమయంలో ఏ కాన్సెప్ట్ తో ముందుకు వెళ్లాలనే విషయంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.

    Also Read: Khammam District Politics: ఖమ్మంలో రసవత్తర రాజకీయం

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమం గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, వివక్ష గురించి కేసీఆర్ తన వ్యాఖ్యలతో ప్రజలను ఆకట్టుకున్నారు. సామాన్యల్లో కలిసిపోతూ వారి తరుపున వాదన వినిపించారు. ఎన్నో పోరాటాలు చేశారు.. ఉద్యమాల్లో పాల్గొన్నారు. చావు అంచుల్లోకి వెళ్లారు. కేసీఆర్ వ్యాఖ్యలు, ఆయన తీరుతో తెలంగాణలోని ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొన్నారు. అసలు రాష్ట్రం ఇక రాదనుకున్న సమయంలో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టారు.

    KCR National Party

    ఇప్పుడు ఇదే తరహాలో దక్షిణాది రాష్ట్రాల సెంటిమెంట్ ను రగల్చనున్నట్లు సమాచారం. దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్నారు. కేంద్రంలో ఇప్పటి వరకు బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలు మాత్రమే అధికారంలోకి వస్తున్నాయి. ఈ పార్టీలకు చెందిన నాయకులంతా ఉత్తరాదికే చెందినవారు. అంతేకాకుండా కేంద్రం నుంచి వచ్చే నిధులు, ఇతర ప్రయోజనాలన్నీ ఉత్తరాది రాష్ట్రాలకే వెళ్తున్నాయని కేసీఆర్ ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతూ నిధులు విడుదల చేయడం లేదంటున్నారు. ఈ విషయంతో దక్షిణాదిపై కేంద్రం వివక్ష అనే అంశంతో పోరు మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

    దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. కర్ణాటకలో బీజేపీ మినహా కొన్ని చోట్ల కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలన్నింటిని ఏకం చేసి దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని కేసీఆర్ వివరించే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా పన్నులు, ఇతర మార్గాల ద్వారా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆదాయం కేంద్రానికి సమకూరుతుందని, కానీ నిధులు సమీకరించడంలో మాత్రం చిన్నచూపు చూస్తున్నారని అంటున్నారు.

    అయితే గతంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని పలు పార్టీలు కలిసి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేసీఆర్ హాజరు కాలేదు. కనీసం మద్దతు కూడా ఇవ్వలేదు. ఈ సమయంలో ప్రాంతీయ పార్టీలన్ని కేసీఆర్ వెంట నడుస్తాయా..? అనే అనుమానాలున్నాయిన కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొన్నటి వరకు థర్డ్ ఫ్రంట్ అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ప్రత్యేక పార్టీ పెట్టి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. తన పార్టీకి మద్దతు కోరేందుకు కేసీఆర్ ఎలాంటి వ్యూహం పన్నుతారో చూడాలి.

    Also Read:Sharad Power Presidential Candidate: రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవర్.. ఏకాభిప్రాయం దిశగా విపక్షాలు

    Tags