Homeజాతీయ వార్తలుKCR Revenge Politics: ప్రతీకార రాజకీయంతో పరువు పోగొట్టుకుంటున్న కేసీఆర్‌..!

KCR Revenge Politics: ప్రతీకార రాజకీయంతో పరువు పోగొట్టుకుంటున్న కేసీఆర్‌..!

KCR Revenge Politics: రాజకీయం అంటే హుందాగా ఉండాలి.. మాటలు తక్కువ.. చేతలు ఎక్కువగా కనిపించాలి. బలం ఉంది కదా అని డబ్బాలో రాళ్లు వేసి ఊపినట్లు.. ఎవరిని పడితే వారిని ఇష్టానుసారం మాట్లాడితే వచ్చే కిరీటం ఏమీ ఉండదు.. పైగా చూసేవారికే రోత పడుతుంది. అసహ్యం పెరుగుతుంది. ఎందుకురా ఇలాంటి వాడిని ఎన్నుకున్నామన్న భావన కలుగుతుంది. కానీ, ప్రజాస్వామ్యంలో మళ్లీ ఎన్నికలు వస్తాయి.. అప్పుడు ఫలితం అనుభవించక తప్పదు. ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఇప్పటికే ఆనేకమార్లు రుజువైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీరు కూడా ఇప్పుడు ఇలాగే ఉంది.

KCR Revenge Politics
KCR Revenge Politics

– ఇదేనా చాణక్యత..
తెలంగాణ సీఎం కేసీఆర్‌ అంటేం రాజకీయ చాణక్యుడని పేరు. ఆయన రాజకీయాల్ని రాజకీయంగా చేస్తారు. ఎక్కడ ఆవేశ పడాలో ఎక్కడ సైలెంట్‌ గా ఉండాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని చెబుతూంటారు. కానీ తెలంగాణ గవర్నర్‌ విషయంలో ఆయన ఆవేశంతో చేసిన రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా ఆయన తనదే తప్పని ఒప్పుకోవాల్సిన పరిస్థితికి తెచ్చాయి. అవమానాలను ఇన్నాళ్లూ భరిస్తూ వచ్చిన గవర్నర్‌ తమిళిపై ఒక్క దెబ్బతో కేసీఆర్‌ను కాళ్ల బేరానికి తెచ్చినంత పనిచేసింది. ఇన్నాళ్లూ గవర్నర్‌ సర్కార్‌ను ఇబ్బంది పెట్టినా.. ఇప్పుడు ఒక్క పనితే కేసీఆర్‌ తానే తప్పు చేసినట్లు కోర్టులో అంగీకరించాల్సిన పరిస్థితి చేజేతులా తెచ్చుకున్నారు. తనను ఇబ్బంది పెడుతున్న గవర్నర్‌రు ఇబ్బంది పెట్టాలన్న కేసీఆర్‌ ఆలోచన సమస్యకు కారణమైంది. గవర్నర్‌ కు ప్రోటోకాల్‌ ఇవ్వడం లేదు. చివరికి ఆమెను ఇబ్బంది పెట్టడానికే అన్నట్లుగా రిపబ్లిక్‌ డే వేడుకల్ని నిర్వహించలేదు. కానీ ఇక్కడ చూడాల్సింది గవర్నర్‌ తమిళిసై ను కాదు.. దేశాన్ని. కానీ కేసీఆర్‌ అలా కూడా చూడలేకపోయారు. చివరికి బడ్జెట్‌ ప్రసంగాన్ని కూడా లేకుండా చేశారు. గవర్నర్‌పై కోపంతో ఇలా చేశారు. బడ్జెట్‌కు గవర్నర్‌ ఆమోదం అవసరం లేకపోతే.. కేసీఆర్‌ తాను అనుకున్నట్లుగా చేసేవారు.

– అదును చూసి దెబ్బకొట్టిన గవర్నర్‌..
ఇన్నాళ్లూ తెలంగాణ సర్కార్‌ అవమానాలను, మంత్రుల విమర్శలు, నేతల చులకన మాటలను మౌనంగా భరిస్తూ వచ్చిన గవర్నర్‌ తమిళిసై ఇప్పుడు అదును చూసి దెబ్బకొట్టారు. తాను ఏం చేయగలనో ప్రభుత్వానికి చూపించారు. ఈ విషయంలో గవర్నర్‌కు ప్రజల మద్దతు లభించడం కేసీఆర్‌కు మింగుడు పడని అంశం.

– నేతల తీరుతోనే అవమానం..
కేసీఆర్‌కు ఇలాంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారణం బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నేతలే. తమ చర్యల ద్వారా ప్రభుత్వ పెద్దలే అలాంటి పరిస్థితి కల్పించారు. గవర్నర్‌ను విమర్శిస్తే సీఎం సంతోషపడతారని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి లాంటి వారు చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. చివరికి ప్రభుత్వం తప్పు చేసినట్లుగా తలొంచుకుని గవర్నర్‌ అధికారాల్ని అంగీకరించాల్సి వచ్చింది. ఇప్పుడు సగౌరవంగా వెళ్లి ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించాలని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి గవర్నర్‌కు ఆహ్వానం ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో దోషిగా ప్రభుత్వం నిలబడింది.

KCR Revenge Politics
KCR Revenge Politics

అధికారం ఉందని, ప్రజలు గెలిపించారని విర్రవీగుతున్న కేసీఆర్‌ ఆవేశం కారణంగా తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు ఆయన తల దించుకునేలా చేశాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular