
సభ్యులకు పాడి పశువు కొనుగోలుకు రూ.75 వేలు, పెరటి కోళ్ల పెంపకానికి రూ.30 వేలు అందించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఎలక్ర్టిక్ ఆటోల కొనుగోలుకు రుణం, బీమా పథకం అమలుపై నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘం సభ్యులకు ఈ ఆర్థిక సంవత్సరం 50 వేల పశువుల కోసం రుణాలు ఇవ్వాలి. ఒక్కో పాడిపశువుపై రూ.75 వేలు రుణంఇవ్వాలి. ఇతర రాష్ట్రాల నుంచి వీటిని కొనుగోలు చేసుకోవాలి.
సభ్యులకు అదనపు ఆదాయం సమకూర్చడం కోసం 5 వేల యూనిట్లకు రుణాలు అందించాలి. ఒక్కో యూనిట్‌లో 50 నుంచి 100 కోళ్లు పెంచడానికి రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు రుణం ఇవ్వాలి. 2 వేల కోడి పిల్లల 150 మదర్ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడిని రుణంగా సమకూర్చాలి. పర్యావరణ పరిరక్షణకు మేలు చేసేలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది వెయ్యి ఎలక్ర్టికల్ ఆటోలు కొనుగోలు చేసేందుకు రుణాలు అందించాలి. ప్రతీ జిల్లాలో కనీసం 30 యూనిట్లు నెలకొల్పాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు.
వ్యవసాయ యంత్రాలు, పనిముట్లను రైతులకు అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తేనుంది. రాష్ట్రంలో వంద కేంద్రాలు నెలకొల్పాలని నిర్ణయించారు. ఈ కేంద్రాలు నెలకొల్పేందుకు మండల సమాఖ్యలకు రూ.25 లక్షల వరకు రుణాలివ్వాలి. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయ సంఘ సభ్యుల కోసం స్త్రీనిధి సురక్ష పథకం అమలు చేయాలి. దీనిద్వారా సంఘ సభ్యులకు రూ.లక్ష వరకు బీమా చేయవచ్చు. ఒక్క సభ్యురాలు సంవత్సరానికి రూ.230 చొప్పున 3 సంవత్సరాలకు రూ.690 చెల్లించాలి. సభ్యురాలు మరణిస్తే రూ.లక్ష ఆమె వారసులకు చెల్లిస్తారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ సభ్యులకు రుణాలు మరింత పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.