https://oktelugu.com/

డ్రగ్స్ కేసు.. నేడు రకుల్.. రేపు దీపిక విచారణ?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య ఇండస్ట్రీలోని ప్రముఖుల మెడకు చుట్టుకుంటోంది. ఈ కేసులో డ్రగ్స్ లింకులు బయటపడటంతో ఆత్మహత్య కేసు పక్కదారి పట్టిపోతోంది. సీబీఐ, ఎన్సీబీ అధికారులు డ్రగ్స్ లింకులపై దృష్టిపెట్టడంతో దర్యాప్తు ఆ దిశగానే కొనసాగుతోంది. తీగలాగితే డొంక కదిలిన చందంగా డ్రగ్స్ సంబంధం ఉన్న ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు. డగ్స్ లింకుల్లో ఎన్సీబీ హీరోయిన్లనే టార్గెట్ చేస్తున్నట్లు కన్పిస్తోంది. ఇప్పటికే సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో […]

Written By:
  • NARESH
  • , Updated On : September 25, 2020 / 12:12 PM IST
    Follow us on


    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య ఇండస్ట్రీలోని ప్రముఖుల మెడకు చుట్టుకుంటోంది. ఈ కేసులో డ్రగ్స్ లింకులు బయటపడటంతో ఆత్మహత్య కేసు పక్కదారి పట్టిపోతోంది. సీబీఐ, ఎన్సీబీ అధికారులు డ్రగ్స్ లింకులపై దృష్టిపెట్టడంతో దర్యాప్తు ఆ దిశగానే కొనసాగుతోంది. తీగలాగితే డొంక కదిలిన చందంగా డ్రగ్స్ సంబంధం ఉన్న ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు.

    డగ్స్ లింకుల్లో ఎన్సీబీ హీరోయిన్లనే టార్గెట్ చేస్తున్నట్లు కన్పిస్తోంది. ఇప్పటికే సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయింది. ఆమెతోపాటు హీరోయిన్లు రాగిణి ద్వివేది.. సంజనా గల్రానాలను ఎన్సీబీ విచారించి పలు కీలక విషయాలను సేకరించినట్లు తెలుస్తోంది. వీటి ద్వారా మరికొందరిని విచారించేందుకు ఎన్సీబీ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది.

    ఈక్రమంలోనే  శుక్రవారం రకుల్ ప్రీత్ సింగ్ ను.. శనివారం దీపిక పదుకోనెలను ఎన్సీబీ విచారించనుందట. ఇప్పటికే వీరికి పోలీసులు నోటీసులు పంపించి విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ గురువారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా నోటిసులు అందలేదని సాకుతో తప్పించుకునే ప్రయత్నం చేసిందట. దీంతో పోలీసులు నాన్ బెయిల్ అరెస్టు వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించడంతో నేడు విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లిందని సమాచారం.

    రకుల్ ను విచారించిన తర్వాత దీపిక పదుకోన్ ను విచారించేందుకు ఎన్సీబీ రెడీ అవుతోంది. దీపికను పోలీసులు విచారించినపుడు వీడియో చిత్రీకరించనున్నారట. ఆమె విచారణ ప్రత్యేకంగా ఉంటుందని.. ఓ ప్రశ్నావళిని ఆమెకు ఇచ్చి సమాధానం స్వయంగా రాయించనున్నారట. వాటి ఆధారంగా విషయాలను రాబట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం గోవా షూటింగులో షూటింగులో ఉన్న దీపిక ఎన్సీబీ విచారణ కోసం ఇప్పటికే ముంబైకి వెళ్లినట్లు తెలుస్తోంది.

    ఎన్సీబీ హీరోయిన్లనే ఎక్కువగా టార్గెట్ చేస్తుండటంపై దర్యాప్తు తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ కేసులో నేరం రుజువైతే మాత్రం హీరోయిన్లు తప్పించుకోలేరని న్యాయనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.