ఈరోజు అసెంబ్లీలో కేసీఆర్ మరో కీలక నిర్ణయం!

తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాలకు పెట్టింది పేరు. కర్రవిరగకుండా పాముచచ్చేలా ఆయన ప్లాన్లు ఉంటాయి. రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తే సమ్మె చేస్తామని ప్రభుత్వ ఉద్యోగులు అప్పట్లో బెదిరించారు. ఉద్యోగుల నుంచి నిరసన వ్యక్తమైంది. భారీ అవినీతి కూపమైన రెవెన్యూను ప్రక్షాళన చేయడం అంత ఈజీ పనికాదని అందరూ అనుకున్నారు. కానీ ఒక్క ఉద్యోగి సమ్మెకు వెళ్లకుండా.. చాకచక్యంగా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేశారు కేసీఆర్..ఈరోజు అసెంబ్లీలో మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తున్నారు. […]

Written By: NARESH, Updated On : September 9, 2020 10:47 am

kcr in assembly

Follow us on

తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాలకు పెట్టింది పేరు. కర్రవిరగకుండా పాముచచ్చేలా ఆయన ప్లాన్లు ఉంటాయి. రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తే సమ్మె చేస్తామని ప్రభుత్వ ఉద్యోగులు అప్పట్లో బెదిరించారు. ఉద్యోగుల నుంచి నిరసన వ్యక్తమైంది. భారీ అవినీతి కూపమైన రెవెన్యూను ప్రక్షాళన చేయడం అంత ఈజీ పనికాదని అందరూ అనుకున్నారు. కానీ ఒక్క ఉద్యోగి సమ్మెకు వెళ్లకుండా.. చాకచక్యంగా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేశారు కేసీఆర్..ఈరోజు అసెంబ్లీలో మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తున్నారు.

Also Read: కేసీఆర్ కొత్త రెవిన్యూ చట్టంతో అవినీతిని అంతమొందిస్తారా…?

సీఎం కేసీఆర్ అన్నంత పనిచేశాడు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలో రెవెన్యూ కోర్టులను రద్దు చేయాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు సమాచారం.  రెవెన్యూ కోర్టుల స్థానంలో జిల్లాకో ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రిటైర్డ్ జడ్జి స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేసే ట్రిబ్యునల్.. ఇకపై మండలం నుంచి జిల్లా వరకు అన్ని భూవివాదాలను పరిష్కరించనుంది. దీంతో తహసీల్దార్ నుంచి ఆర్డీవో, జేసీ వరకు ఉన్న మూడంచెల వ్యవస్థకు కేసీఆర్ చరమగీతం పాడారు. ఇక ట్రిబ్యునల్ లో తీర్పు నచ్చని వారు కలెక్టర్ కు అప్పీల్ చేసే సౌకర్యం కల్పించారు.ఇలా రెవెన్యూ వ్యవస్థలో అవినీతి లేకుండా పూర్తి పారదర్శకంగా కేసీఆర్ ముందుకు పోతున్నారు.

భూవివాదాల పరిష్కారానికి ప్రతి శనివారం తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా రెవెన్యూ కోర్టులను నిర్వహించేవారు. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ ఈ భూవివాదాలపై తీర్పులు చెప్పేవారు. ఈ క్రమంలో వివాదాల్లో జాప్యం, మితిమీరిన అవినీతి ఆరోపణలు వచ్చేవి. దీంతో ఈ వ్యవస్థనే తీసివేస్తూ కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు.

Also Read: బాలకృష్ణను కెలికిన పోసాని… ఏం జరిగిందంటే….

ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఈ సంప్రదాయానికి మంగళం పాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం శాసనసభ ముందుకు రానున్న భూ యాజమాన్య హక్కులచట్టం -2020(ఆర్ఓఆర్) బిల్లులో ఈ మేరకు పొందుపరిచినట్లు సమాచారం.

మొత్తం రెవెన్యూ శాఖపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన కేసీఆర్.. ఇప్పుడు ప్రక్షాళన చేస్తూ ముందుకెళ్తున్నారు.   రెవెన్యూ కోర్టుల్లో మితిమీరిన అవినీతి ఆరోపణలు రావడంతో వీటిని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అందుకే రెవెన్యూ కోర్టులను రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చింది.