spot_img
Homeజాతీయ వార్తలుCM KCR: నీ దూకుడు.. కేసీఆర్ కు సాటి ఎవ్వరు?

CM KCR: నీ దూకుడు.. కేసీఆర్ కు సాటి ఎవ్వరు?

CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రేసులో కేసీఆర్‌ దూసుకుపోతున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన గులాబీ బాస్‌ ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్‌ విజయంతో రికార్డు సృష్టించాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే అన్ని విషయాల్లో విపక్షాలకంటే ముందే ఉంటున్నారు. షెడ్యూల్‌కు 50 రోజుల ముందే అభ్యర్థులను ప్రకటించారు. అన్ని పార్టీలకన్నా ముందే మేనిఫెస్టో ప్రకటించారు. ఫ్లాష్‌ స్కీంలతో మెజారిటీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కేసీఆర్‌ బీమా పేరుతో 93 లక్షల కుటుంబాలను ప్రభావితం చేయనున్నారు. పెన్షన్లు, రైతుబంధు, దళితబంధు, బీసీ బంధు, మైనారిటీబంధు తదితర స్కీంలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ప్రచారంలోనూ దూకుడు..
టికెట్లు, మేనిఫెస్టో విషయంలోనే కాదు.. ప్రచారంలోనూ కేసీఆర్‌ దూకుడు ప్రదర్శిస్తున్నారు. దాదాపు నెల రోజులు అనారోగ్యంతో కేసీఆర్‌ జనానికి కనిపించలేదు. కానీ, పూర్తిగా కోలుకున్నాక ప్రచారం మొదలు పెట్టారు. నోటిఫికేషన్‌ వచ్చే నాటికే 30 సభలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పటికే ఐదారు సభలు నిర్వహించారు. తాజాగా మంగళవారం కొడుకు నియోజకవర్గం సిరిసిల్ల, మేనల్లుడి నియోజకవర్గం సిద్దిపేటలో ప్రచారం చేశారు. కుటుంబ సభ్యులతోపాటు కేటుంబేతర అభ్యర్థులను గెలిపించేలా ప్రచారంలో దూసుకుపోతున్నారు.

ఉద్యోగులు, నిరుద్యోగుల్లోనే వ్యతిరేకత..
9 ఏళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌పై తెలంగాణలో 60 శాతం వ్యతిరేకత ఉందని సర్వేలు చెబుతున్నాయి. అయినా వాటిని అధిగమించగలమన్న ధీమా కేసీఆర్‌లో కనిపిస్తోంది. ఉద్యోగులు, నిరుద్యోగులు మాత్రమే తమకు ఓటు వేయరని, మిగతా అన్నివర్గాలు తమకు కలివస్తాయని గులాబీ బాస్‌ లెక్కలు వేసుకుంటున్నారు. పెన్షనర్లు, రైతుల ఓట్లు 90 శాతం బీఆర్‌ఎస్‌కే పడతాయన్న నమ్మకంతో ఉన్నారు. తాజాగా ప్రకటించిన కేసీఆర్‌ బీమాతో తెల్ల రేషన్‌కార్డు ఉన్న పేద కుటుంబాల్లో కనీసం సగం ఓట్లు బీఆర్‌ఎస్‌కు మళ్లుతాయని అంచనా వేస్తున్నారు. దళితబంధు, బీసీబంధు, మైనారిటీ బంధు కొనసాగిస్తున్న నేపథ్యంలో వారి ఓట్లు కూడా బీఆర్‌ఎస్‌కే అని లెక్కలు వేస్తున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు నిరుద్యోగులు, ప్రతినెలా సరైన సమయానికి వేతనాలు, డీఏలు, పీఆర్సీ ఇవ్వనందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉంటారని భావిస్తున్నారు. వీరంతా కలిస్తే 10 నుంచి 15 లక్షలకు మించి ఉండని గులాబీ బాస్‌ ఆలోచన. మిగతా 3 కోట్ల మందిలో కనీసం 2 కోట్ల ఓట్లు బీఆర్‌ఎస్‌వే అన్న ధీమాతో ఉన్నారు. మరి ఓటర్ల నిర్ణయం ఎలా ఉండబోతుందో చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper
Exit mobile version