Varun Tej: త్వరలోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి జరగనుంది. వీరి ఎంగేజ్మెంట్ జరిగిన దగ్గర నుంచి ప్రతి వార్త వైరల్ అవుతూనే ఉంది. డ్రెసింగ్, కాస్టూమ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ ప్రతి వార్త వైరల్ గా మారుతుంది. ఇక ఇటలీలో వీరి పెళ్లి జరగనుందనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటో చూసేయండి…
లావణ్య, వరుణ్ లు ముందే మరొకరితో రిలేషన్ లో ఉన్నారని, వరుణ్ కంటే ముందు లావణ్యకు, లావణ్య కంటే ముందు వరుణ్ కు మరొకరితో రిలేషన్ ఉండేదని వార్తలు వచ్చాయి. కానీ వాటిపై స్పందించలేదు ఇద్దరు స్టార్లు. అదే విధంగా ఇప్పుడు వరుణ్ లావణ్య కంటే ముందే మరొకరితో రిలేషన్ లో ఉన్నారని.. అన్ని కుదిరితే ఆ అమ్మాయే మెగా ఇంటి కోడలిగా అడుగుపెట్టేదనే వార్త వైరల్ అవుతుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు వరుణ్ తేజ్ మొదటి సినిమా ముకుంద హీరోయిన్ పూజ హెగ్డే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ముకుంద సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోకపోయినా ఈ పెయిర్ మాత్రం మంచి రెస్పాన్స్ ను అందుకుంది. వీరి కాంబినేషన్ సూపర్ అనే టాక్ వచ్చింది.
అంతేకాదు ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తుందనే టాక్ వినిపించింది. అదే సమయంలో గిప్టులు ఇచ్చుకునేవారని, ఆ తర్వాత పార్టీలకు కూడా వెళ్లేవారని టాక్ వచ్చింది. అంతేకాదు వరుణ్ పూజాను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట.. కానీ ఈ విషయం తెలిసిన నాగబాబు వార్నింగ్ ఇచ్చారట. మొదటి సినిమాతోనే లవ్, రిలేషన్ అంటే కెరీర్ నాశనం అవుతుందని.. అది కేవలం మొదటి సినిమా మాత్రమే కాబట్టి ముందు కెరీర్ లో సెటిల్ అవ్వమని హెచ్చరించారట నాగబాబు. దీంతో వరుణ్ కూడా ఏం చేయలేకపోయారనే టాక్ వచ్చింది. కానీ ప్రస్తుతం ఇష్టపడ్డ అమ్మాయితోనే వరుణ్ పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి ఆ వార్తల్లో నిజం లేదని అంటున్నారు మెగా అభిమానులు.