తెలంగాణా సీఎం కేసీఆర్ నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పారు. నిరుద్యోగులకు ఉపాధిని అందించే రెండు కీలక పథకాలను ప్రవేశపెడుతున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
ఇంటి వద్ద ఉండే బీసీ మహిళలకు ఆదాయం చేకూరేలా దాదాపు 10 వేలమంది నిరుద్యోగ మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చెయ్యాలని నిర్ణయించారు. అంతే కాకుండా నిరుద్యోగ మహిళలకు నిఫ్ట్ ద్వారా శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించనున్నట్లు మంత్రి తెలియజేసారు.
మరో పథకం “ఆపద్బంధు” పేరుతో ఎంబీసీ యువకుల కోసం అంబులెన్స్‌లను పంపిణీ చేయనున్నారు. అర్హులైన బీసీ విద్యార్థులకు ఒక్కటి చొప్పున అంబులెన్స్‌లను బీసీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు గంగుల తెలియజేసారు. ఆపద్బంధు పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగించటమే కాకుండా, మారుమూల ప్రాంతాలకు కూడా అంబులెన్స్ సేవలను విస్తరించడం జరుగుతున్నదని మంత్రి తెలియజేసారు. ఈ రెండు పథకాలను త్వరలోనే ప్రవేశపెట్టబోతున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలియజేసారు.