
తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని రైతులకు మరో శుభవార్త చెప్పారు. రైతు బంధు స్కీమ్ అమలు ద్వారా ఇప్పటికే రాష్ట్రంలోని రైతులకు ప్రయోజనం చేకూరేలా చేస్తున్న సీఎం కేసీఆర్ రైతు వేదికల ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేశారు. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రైతు వేదిక ప్రారంభం కానుంది. రైతు వేదిక ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.
సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో రైతు వేదికల ఏర్పాటు, రైతు వేదికల ఉపయోగాలు, ఇతర విషయాల గురించి వివరిస్తారు. కేసీఆర్ రైతు వేదిక ప్రారంభం అనంతరం ప్రకృతి వనాన్ని సందర్శించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతుబంధు జిల్లా, మండల, గ్రామ కమిటీలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నాయి. ప్రభుత్వం రైతు వేదికల ద్వారా రైతులంతా ఒకే చోట చేరి పంటలు, వ్యవసాయానికి సంబంధించిన ఇతర విషయాల గురించి చర్చించుకునే అవకాశం కల్పిస్తోంది.
రైతు వేదిక ప్రారంభానికి జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. రైతు బంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరావు, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో మొత్తం 2,604 రైతు వేదికలను నిర్మిస్తోంది. ప్రభుత్వం ఇందుకోసం 573 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.
ఏపీలో రైతు భరోసా కేంద్రాలలా తెలంగాణలో రైతు వేదికలు ఏర్పాటు కానున్నాయని సమాచారం. అయితే రైతు వేదికల ఏర్పాటుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. రైతులకు ప్రయోజనం చేకూరేలా కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Comments are closed.