KCR: దేశ రాజకీయాల్లోకి ప్రవేశించి, కీ రోల్ పోషించాలనుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కల నెరవేరేలా కనిపించడం లేదు. ఇప్పటికే రెండు మూడు సార్లు ఆ ప్రయత్నం చేసినా.. అవి ఫలించలేదు. ఇటు టీఆర్ఎస్‌కు బీజేపీకి పొసగని ప్రతీ సారి కేంద్రంలోకి వెళ్తానని ప్రకటించారు.ఇందులో భాగంగా బీజేపీయేతర, కాంగ్రెసేత పార్టీలను కలుపుకొని కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేయాలని చూశారు. ఇందులో కమ్యూనిస్టు పార్టీలను కూడా కలుపుకోవాలని భావించారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు దొందు దొందేనని, ఆ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కొత్త థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఈ ఫ్రంట్‌కు అవసరమైతే తానే నాయకత్వం వహిస్తానని చెప్పారు.

థర్డ్ ఫ్రంట్ దిశగా అడుగులు..
దేశ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాల ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అడుగులు కూడా వేశారు. పశ్చిమ బెంగాల్‌కు వెళ్లి మమతా బెనర్జీని కలిశారు. ఆమెతో చర్చలు జరిపారు. అలాగే ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటి అయ్యి చర్చలు నిర్వహించారు. దేశ వ్యాప్తం తిరిగి మిగితా పార్టీలను కలుపుకోవాలని చూశారు. కానీ ఏమైందో ఏమో గాని కొన్ని రోజులకే ఆ అంశం మరుగున పడిపోయింది. దానిపై ఊసే కనిపించలేదు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తానని ప్రకటించడంతో ఇక్కడ టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. కేసీఆర్‌కు మద్దుతుగా ర్యాలీలు నిర్వహించారు. మరి ఈ థర్డ్ ఫ్రంట్ సాధ్యం కాదని వారు చెప్పారో తెలియదు కానీ సీఎం కేసీఆర్ కూడా ఆ టాపిక్ చాలా రోజులు ఎత్తలేదు.
వ్యవసాయ చట్టాలపై పోరాటానికి రెడీ అయ్యేలోపే..
వడ్ల కొనుగోలు విషయంలో వచ్చి ఆందోళనలు మళ్లీ సీఎం కేసీఆర్‌ను దేశ రాజకీయాల అంశం మాట్లాడేలా చేసింది. వడ్లను కేంద్రం కొనవద్దు అంటుందని అందుకే తాము కొనడం లేదని చెప్పారు. దీంతో రాష్ట్ర బీజేపీ నాయకులు టీఆర్ఎస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంపై టీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తుందని తిప్పికొట్టారు. టీఆర్ఎస్ చెప్తున్న విషయాలన్నీ తప్పేనంటూ రైతులకు అర్థం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read: Crying men: ఏడ్చే మొగాళ్లను నిజంగానే నమ్మకూడదా..? ఎందుకు..?
ఈ నేపథ్యంలో ఒక రోజు వెనకా ముందు టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఆందోళనలు నిర్వహించారు. వడ్లు కొనాలని ఇరు పార్టీలు డిమాండ్ చేశాయి. రెండు రోజుల క్రితం డైరెక్ట్ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. ధర్నా చౌక్ వద్ద ధర్నా చేశారు. కేంద్రం వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగానే కేంద్రంపై ఆరోపణలు చేశారు. బీజేపీ రైతు వ్యతిరేకి అని అందులో భాగంగానే మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చిందని ఆరోపించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతుల కోసం ఎన్నో కొత్త పథకాలు తీసుకొచ్చిందని అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని అన్నారు. ఈ చట్టాల రద్దు కోసం తాను ఉద్యమం చేస్తానని అన్నారు. రైతులు చేస్తున్న ఉద్యమానికి తానే నాయకత్వం వహిస్తానని చెప్పారు. కానీ ఆ ప్రకటన చేసిన ఒక రోజు తర్వాతే ప్రధాని నరేంద్ర మోడీ ఒక ప్రకటన చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని, పార్లమెంట్ సమావేశాల్లో ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. ఇదే అంశంపై దేశ రాజకీయాల్లోకి మళ్లీ ఎంట్రీ ఇద్దామనుకున్న సీఎం కేసీఆర్ ఆశ అడియాశలయ్యాయి.
Also Read: Repeal of Agricultural Laws: వ్యవసాయ చట్టాల రద్దు వెనుక ఇంత స్టోరీ ఉందా..?