https://oktelugu.com/

అసెంబ్లీలో ప్రజలపై కేసీఆర్ వరాలు.. కీలక హామీలు

సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మరోసారి వరాలు కురిపించారు. వివరణలు ఇచ్చారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎఫ్.సీ.ఐ సేకరించిన ధాన్యంలో 55శాతం తెలంగాణ నుంచి సేకరించినదేనని కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఎఫ్.సీ.ఐ స్వయంగా వెల్లడించిందని.. ఇది మన తెలంగాణ ఘనత అని అన్నారు. వందశతం తాగునీరు అందిస్తున్న ఏఖైక రాష్ట్రం తెలంగాణ అని.. కోటి ఎకరాల మాగాణి మాకల అని.. ఇవాళ రూ.1.25 కోట్ల ఎకరాలకు […]

Written By:
  • NARESH
  • , Updated On : March 26, 2021 / 05:20 PM IST
    Follow us on

    సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మరోసారి వరాలు కురిపించారు. వివరణలు ఇచ్చారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎఫ్.సీ.ఐ సేకరించిన ధాన్యంలో 55శాతం తెలంగాణ నుంచి సేకరించినదేనని కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఎఫ్.సీ.ఐ స్వయంగా వెల్లడించిందని.. ఇది మన తెలంగాణ ఘనత అని అన్నారు.

    వందశతం తాగునీరు అందిస్తున్న ఏఖైక రాష్ట్రం తెలంగాణ అని.. కోటి ఎకరాల మాగాణి మాకల అని.. ఇవాళ రూ.1.25 కోట్ల ఎకరాలకు చేరుకుందని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.

    తెలంగాణ వ్యవసాయ రంగంలో 17.73 శాతం వృద్ధి నమోదైందని కేసీఆర్ వెల్లడించారు. ఒక ఏడాదిలో రూ.లక్ష కోట్ల విలువైన పంట పండించామని.. తలసారి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగం పెరిగినట్లు చెప్పారు.

    రాష్ట్రంలో అప్పులు పెరిగాయనే వాదన సరికాదని.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అప్పులు చాలా తక్కువ అని కేసీఆర్ తెలిపారు. అప్పుల విషయంలో తెలంగాణ దేశంలో 22వ స్థానంలో ఉందని తెలిపారు. కరోనా టైంలో తక్కువ అప్పులు చేసిన రాష్ట్రం తెలంగాణ అన్నారు.

    ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే వేతనాలు పెంచుతున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. అలాగే ప్రొబేషనరీ పంచాయతీ కార్యదర్శకులకు ఏప్రిల్ నుంచి రెగ్యులర్ ఉద్యోగులతోపాటు వేతనాలు చెల్లిస్తామని తెలిపారు. ఇక నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించారు.