https://oktelugu.com/

ఎట్టకేలకు ఉద్యోగుల కోరిక తీర్చిన కేసీఆర్

సంవత్సరాల తరబడి నిరీక్షణ, ఏళ్లుగా పీఆర్సీ కోసం పోరాటం.. కళ్లు కాయలు కాసి పండ్లు అయినా కూడా ఉద్యోగుల కోరిక తీరలేదు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలే ఉద్యోగుల రాతమార్చాయి. ఎమ్మెల్సీ గెలిపిస్తే పీఆర్సీ గ్యారెంటీ అని సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు ఉద్యోగులు సరేనన్నారు. కేసీఆర్ కు ఉద్యోగ ఎమ్మెల్సీ గెలిపించి ఇచ్చారు. అలా తెలంగాణ మార్చి బడ్జెట్ లో పీఆర్సీకి ఆమోదం లభించింది. ఇక కరోనా లాక్ డౌన్ తో వాయిదా పడిన వేతన సవరణకు […]

Written By:
  • NARESH
  • , Updated On : June 9, 2021 / 09:22 AM IST
    Follow us on

    సంవత్సరాల తరబడి నిరీక్షణ, ఏళ్లుగా పీఆర్సీ కోసం పోరాటం.. కళ్లు కాయలు కాసి పండ్లు అయినా కూడా ఉద్యోగుల కోరిక తీరలేదు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలే ఉద్యోగుల రాతమార్చాయి. ఎమ్మెల్సీ గెలిపిస్తే పీఆర్సీ గ్యారెంటీ అని సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు ఉద్యోగులు సరేనన్నారు. కేసీఆర్ కు ఉద్యోగ ఎమ్మెల్సీ గెలిపించి ఇచ్చారు. అలా తెలంగాణ మార్చి బడ్జెట్ లో పీఆర్సీకి ఆమోదం లభించింది.

    ఇక కరోనా లాక్ డౌన్ తో వాయిదా పడిన వేతన సవరణకు రాష్ట్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. పెరిగిన వేతనం జూలై నెలలో చేతికి అందనున్నది. దీంతోపాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కలిపి మొత్తం 9,21,037 మందికి 30శాతం ఫిట్ మెంట్ (వేతనాల పెంపు) ఇవ్వాలని గత మార్చిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తసీుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

    పెంచిన వేతనాన్ని జూన్ నెల నుంచి చెల్లించాలని నిర్ణయించింది. నోషనల్ బెనిఫిట్ ను 2018 జూలై1 నుంచి మానిటరీ బెనిఫిట్ ను 2020 ఏప్రిల్ 1 నుంచి.. క్యాష్ బెనిఫిట్ ను 2021 ఏప్రిల్ 1 నుంచి అమలు చేసేందుకు అనుమతించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.

    పింఛనుదారులకు 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మే 31 వరకు చెల్లించాల్సిన ఏరియర్స్ లను 36 వాయిదాల్లో చెల్లించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. మొత్తం గత ఏడు దశాబ్ధాల్లో పీఆర్సీ కూడా పట్టించుకోని దాదాపు 6 లక్షల మంది తాత్కాలిక ఉద్యోగులందరికీ రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఫిట్ మెంట్ ను ప్రకటించడం దేశంలో ఇదే మొదటి సారి కావడం గమనార్హం.