Homeజాతీయ వార్తలుపరుష ప్రసంగానికి కేసీఆర్ పుల్ స్టాఫ్..!! ఆ రెండు ఎన్నికల తరువాత మారిపోయాడా..?

పరుష ప్రసంగానికి కేసీఆర్ పుల్ స్టాఫ్..!! ఆ రెండు ఎన్నికల తరువాత మారిపోయాడా..?

KCR

పదునైన వ్యాఖ్యలు.. ప్రతిపక్షాలపై విమర్శలు.. రాజకీయ సవాళ్లు.. కేంద్రప్రభుత్వంపై విమర్శలు.. ఇవన్నీ కేసీఆర్ ప్రసంగంలో కనిపిస్తాయి. పక్కా తెలంగాణ భాషలో అవసరమైతే పరుష వ్యాఖ్యలు సంధించి మాట్లాడే కేసీఆర్ ఒక్కసారిగా వాటికి ఫుల్ స్టాఫ్ పెట్టారు.  ఇటీవల సిద్ధిపేట జిల్లాలో పర్యటించిన కేసీఆర్ దేశ రాజకీయాల జోలికి పోకుండా  కేవలం ఆ ప్రాంతం గురించే మాట్లాడడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.  ఈ ప్రసంగం చూసిన వారందరూ కేసీఆర్ మారిపోయాడా..? అని చర్చించుకుంటున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత కేసీఆర్  తన ప్రసంగంలో మార్పులు చేశాడా..? అని అనుకుంటున్నారు.

Also Read: ఇంతకు విజయశాంతి కేసీఆర్ ను తిట్టిందా.. పొగిడిందా?

తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి కేసీఆర్ ప్రసంగం అంటే రాష్ట్ర ప్రజలు, ఆయన అభిమానులు టీవీలకు అతుక్కపోయి కూర్చుంటారు.. అవకాశం లేనోళ్లు మొబైల్ లైవ్ పెట్టుకుంటారు.. ఎన్ని పనులున్నా ఆయన ప్రసంగంలో ఏదో ఆసక్తి ఉంటుందనే భావన దాదాపు అందరిలోనూ ఉంది.. అర్థమయ్యే సులభ భాషలో ప్రజలకు వివరించడమే కేసీఆర్ స్టైల్.. అందుకే ఆయన ప్రసంగాన్ని సొంత పార్టీల నాయకులే కాకుండా ప్రతిపక్షాల నాయకులు సైతం ఆసక్తిగా వింటుంటారు.

2019లో కేసీఆర్ రెండో సారి అధికారంలో వచ్చినప్పటి నుంచి తక్కువ మాట్లాడుతున్నా.. వాడీ వేడీ వ్యాఖ్యలు చేస్తున్నాడు. ముఖ్యంగా ప్రతిపక్షాలపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. దీంతో ఆయన ప్రజల్లో కాస్త చులకన అయ్యారు. ఇది గ్రహించిన కేసీఆర్ సిద్ధిపేటలో రాజకీయంగా ఒక్క మాట కూడా మాట్లడలేదు. ఎక్కడా పరుష వ్యాఖ్యలు వాడలేదు..

డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఐటీ హబ్ ప్రారంభంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  సిద్ధిపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సిద్ధిపేటకు, తనకు ఉన్న అనుబంధాన్ని చెప్పుకున్నాడు. సిద్ధిపేట లేకుంటే కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేకుంటే సిద్ధిపేట లేదు.. అని సెంటిమెంట్ పండించాడు. అంతేకాకుండా ఇక్కడ వరాలు కూడా కురిపించారు. సిద్ధిపేట జిల్లాకు మరో వెయ్యి డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా రాజీవ్ రహదారి విస్తరణకు రూ.160 కోట్లు నిధులు విడుదల చేసేందుకు ఒప్పుకున్నాడు. అలాగే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

Also Read: పెద్దాయన సీఎం ఆశలు మాత్రం చావడం లేదుగా..!

ఆ తరువాత జిల్లా మంత్రి హరీశ్ రావును పొగడ్తలతో ముంచెత్తాడు. తనకు ప్రతినిధిగా హరీశ్ రావు సిద్ధిపేట జిల్లాకు ఎంతో అభివృద్ధి చేశాడని తెలిపారు. తన లాగే పనిచేసే నాయకుడు కావాలని సిద్ధిపేటకు హరీశ్ రావును పెట్టానని, తన పేరు కాపాడిన నాయకుడు హరీశ్ రావు అని కేసీఆర్ అన్నారు.

ప్రతీ ప్రసంగంలో ఆగ్రహం, విమర్శలతో ఊగిపోయిన కేసీఆర్ ఒక్కసారిగా సెంటిమెంట్ వ్యాఖ్యలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం సాగుతోంది. ఇందులో భాగంగా ఇటీవల బంద్ నిర్వహించారు. బంద్ కు  కేసీఆర్  పూర్తి మద్దతు ప్రకటించారు.  ఈ విషయంపై సిద్ధిపేటలో  ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మొన్నటి వరకు ఆయన చేసిన ప్రతీ ప్రసంగంలోనూ బీజేపీపై  విమర్శలు చేసిన కేసీఆర్  ఇక్కడ మాత్రం  ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

ఇక అంతకుముందు డిసెంబర్ రెండో వారంలో మూడోఫ్రంట్ విషయంపై ప్రతిపక్షాలను కలుస్తానన్న ఆయన ఆ ఊసే ఎత్తకపోవడంపై రకరకాలుగా చర్చ సాగుతోంది. ఏదీ ఏమైనా కేసీఆర్ దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత కేసీఆర్ తన వ్యూహాన్ని మార్చినట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

Exit mobile version