Dalita Bandhu: ఎన్నికల్లో ఓట్ల పంట పండించుకోవడమంటే ఒక్క కేసీఆర్ (KCR) కే చెల్లుతుంది. చెట్టు పేరు చెప్పి కాయలమ్మడం అందరికి చేతకాదు. ఈ విషయంలో కేసీఆర్ ముందస్తు ప్రణాళికలు వేస్తుంటారు. ఓట్లు రాల్చడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయనకు ఆయనే పోటీ. ప్రజలను తనదైన ప్రసంగంతో ఆకట్టుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ నేపథ్యంలో దళితబంధు (Dalita Bandhu) పథకంతో అందరిలో ఆసక్తి గొలుపుతున్నారు. దీంతో అన్ని వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. తమకు కూడా ఈ పథకం వర్తింపజేయాలని అందరి నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులకు కూడా సెగ తగులుతోంది. ఓట్ల మాట దేవుడెరుగు కానీ ప్రస్తుతం నేతల మీద దళితబంధు పథకం తలనొప్పులు తెస్తోంది.
ఇప్పుడు దళితబంధు పథకంతో ఓట్లు రాలడం ఏమోకానీ నేతల ప్రాణాల మీదకు వస్తోంది. పథకం అమలుపై అందరిని రాజీనామా చేయాలని ఓటర్ల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. దీంతో నేతలు తప్పించుకు తిరుగుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ధర్నాలు చేస్తున్నారు. దళితబంధు పథకం తమకు వర్తింపచేయాలని అడుగుతున్నారు. దళితులకు మాత్రమే దళితబంధు పథకం తెస్తే మా గతి ఏం కావాలని మిగతా వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు. మాకు కూడా అలాంటి పథకం ప్రారంభించాలని గొంతెత్తుతున్నారు. అయితే దళితబంధు పథకం అందరికి వర్తింపజేయాలంటే మూడు నాలుగేశ్లు పడుతుందని చెబుతున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో దీన్నే ప్రధాన ఆయుధంగా చేసుకుని ఓట్లు సాధించాలని చూస్తున్నారు.
హుజురాబాద్ లో నిర్వహించిన దళితబంధు ప్రారంభోత్సవంలో కేసీఆర్ పథకం అమలుపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే మూడు నాలుగేళ్లలో రాష్ర్టం మొత్తం అమలు చేస్తామని చెప్పారు. పథకం పూర్తిస్థాయిలో ప్రజలకు చేరాలంటే ప్రజలే బాధ్యత వహించాలని చెబుతున్నారు. రెండేళ్లలో ఎన్నికలు వస్తే అందులో పథకం గురించి చెప్పి వారిని సమాయత్తం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఐదు స్టేట్ల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తరువాత దళితబంధు ఒక్కటే గట్టెక్కించగలదని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేసీఆర్ కు ఇదే మాస్టర్ ప్లాన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
దళితబంధు పథకంపై ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు చేస్తున్నాయి. దళితబంధు పథకాన్ని అన్ని వర్గాలకు అందించాలి. ఎన్నికలకు ముందే పథకం వర్తింపజేయాలని సూచిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాత్రం దళితుల ఓట్లు తనకే పడతాయని చెబుతున్నారు. విజయం తనదే ఖాయమనుకుని కేసీఆర్ లెక్కకు మించి పథకాలు తెస్తూ ప్రజలకు అందేలా చేయడంలో తనదే పాత్ర ఉందని పేర్కొంటున్నారు.