https://oktelugu.com/

కేసీఆర్‌‌ రంగంలోకి దిగితే.. ఆ కిక్కే వేరప్పా

దేశవ్యాప్తంగా ఒక్కో ముఖ్యమంత్రిది ఒక్కో రకమైన పాలన. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో పాలన సాగిస్తుంటారు. అందులోనూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ పాలనా విధంగా అందరికంటే డిఫరెంట్‌. ఎప్పుడు స్తబ్దుగా ఉంటారో.. ఎప్పుడు పరిగెత్తిస్తారో ఎవరికీ అర్థం కాదు. ఏదైనా అంశాన్ని టార్గెట్‌ చేస్తే అదే అంశంపై పొద్దంతా రివ్యూలు.. పెద్ద ఎత్తున నిర్ణయాలు వడివడిగా తీసుకుంటుంటారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమిటన్న విషయంపై తాజాగా జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 1, 2021 / 11:51 AM IST
    Follow us on


    దేశవ్యాప్తంగా ఒక్కో ముఖ్యమంత్రిది ఒక్కో రకమైన పాలన. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో పాలన సాగిస్తుంటారు. అందులోనూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ పాలనా విధంగా అందరికంటే డిఫరెంట్‌. ఎప్పుడు స్తబ్దుగా ఉంటారో.. ఎప్పుడు పరిగెత్తిస్తారో ఎవరికీ అర్థం కాదు. ఏదైనా అంశాన్ని టార్గెట్‌ చేస్తే అదే అంశంపై పొద్దంతా రివ్యూలు.. పెద్ద ఎత్తున నిర్ణయాలు వడివడిగా తీసుకుంటుంటారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమిటన్న విషయంపై తాజాగా జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు.

    Also Read: కొత్త సంవత్సరం వేళ.. కేసీఆర్‌‌ స్వీట్‌ న్యూస్‌

    ధరణి వెబ్ పోర్టల్ అందుబాటులోకి వచ్చి ఎన్నిరోజులు అయ్యిందో తెలిసిందే. అది అందుబాటులోకి వచ్చినప్పటి నుంచే సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అయితే.. ఇన్నిరోజుల పాటు వాటిపై స్పందించని కేసీఆర్.. తాజాగా ప్రగతిభవన్ లో రివ్యూ పెట్టారు. గంటల తరబడి ఈ ఇష్యూపై మథనం చేయటంతోపాటు పలువురి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా వడివడిగా నిర్ణయాలు తీసుకున్నారు. ధరణి వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చిన రెండు నెలల్లోనే 1.1 లక్షల మంది ధరణి స్లాట్ బుక్ చేసుకున్నారని.. 80 వేల మంది రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ఐదు ఎకరాలలోపు రైతులు 90 శాతం మంది వరకు ఉంటారని.. అలాంటి చిన్న రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా భూములు రిజిస్టర్ చేయించుకొని.. మ్యుటేషన్ చేయించుకోవటానికి వీలుగా ఉండాలన్నదే ధరణి లక్ష్యమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

    మంత్రులు..సీనియర్ అధికారులు.. కలెక్టర్లతో సుదీర్ఘంగా మాట్లాడిన అనంతరం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకుంది. తాజాగా ప్రభుత్వం విడుదల కొన్ని ఆదేశాలను ఇచ్చింది. ఇదే రీతిలో సీఎం సారు ఫాంహౌస్ కు పోకుండా పాలన మీదనే ఫోకస్ మరెన్ని నిర్ణయాలు తీసుకుంటారో అన్న భావన కలుగక మానదు.

    కేసీఆర్‌‌ తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి. పట్టాదార్ పాసు బుక్కులు పోయినట్లయితే.. వాటి స్థానంలో సర్టిఫైడ్ కాపీ తీసుకునే అవకాశం కల్పించాలని సూచించారు. ప్రభుత్వ భూములు చెరువు ఎఫ్టీఎల్ భూములు దేవాదాయ భూములు వక్ఫ్ భూములు అటవీ భూములను ఎట్టి పరిస్థితుల్లో పైవ్రేటు వ్యక్తులకు రిజిస్టర్ చేయొద్దని ఆదేశించారు. -ఇనామ్ భూములను సాగు చేసుకుంటున్న హక్కు దారులకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇచ్చి ఆ వివరాలను ధరణిలో నమోదు చేయాలన్నారు. -ధరణిలో స్లాట్ బుక్ కాకపోతే ఎందుకు కావడం లేదనే విషయం దరఖాస్తు దారుడికి తెలిపే ఆప్షన్ ఉండాలని పేర్కొన్నారు. రెవెన్యూ కోర్టుల్లోని భూముల వివాదాలను పరిష్కరించడానికి జిల్లాకు ఒకటి చొప్పున ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలి. వాటిని కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించాలి.

    Also Read: త్వరలోనే బీజేపీలో చేరుతున్నా..: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    1/70 చట్టం అమలులో లేని ప్రాంతాల్లో ఆ చట్టం కింద నమోదైన కేసులను పరిష్కరించాలి. అమల్లో ఉన్న చోట ఆ ప్రాంత గిరిజనరుల హక్కులు కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి. రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి క్షేత్రస్థాయిలో ఉన్న విస్తీర్ణానికి తేడాలుంటే కలెక్టర్లు విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకోవాలి. ఆ వివరాలను ధరణిలో నమోదు చేసి పాసు బుక్కులు ఇవ్వాలి. ఒక సర్వే నంబర్లో ప్రభుత్వ ప్రైవేట్ భూములుంటే ఆ సర్వే నంబర్ అంతా నిషేధిత జాబితాలో పెట్టారు. అలాంటి కేసులు ఉన్న చోట కలెక్టర్లు విచారణ జరిపి ప్రభుత్వ భూములను మాత్రమే నిషేధిత జాబితాలో పెట్టాలి. ధరణి పోర్టల్ ద్వారా లీజ్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించాలని సూచించారు. వీటితోపాటే మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్