ఎమ్మెల్సీ రంగంలోకి కేసీఆర్‌‌ : వినూత్న ప్రచారం

తెలంగాణలోని అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమిని చవిచూసింది. ఇక గ్రేటర్‌‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో మేయర్‌‌ పీఠం కైవసం చేసుకున్నా.. నైతికంగా ఓటమి ఎదుర్కొన్నట్లేనని నిపుణులు అంటుంటారు. ఎందుకంటే గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని చెప్పుకొచ్చిన అధికార పార్టీ మంత్రులు, నేతలకు ఎదురుదెబ్బ తగిలింది. వంద సీట్లు వస్తాయని చెప్పుకున్నా.. మునుపటి ఎన్నికల కంటే తక్కువ సీట్లే వచ్చాయి. Also Read: భాగ్యనగరిలో బతుకు […]

Written By: Srinivas, Updated On : March 2, 2021 12:18 pm
Follow us on


తెలంగాణలోని అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమిని చవిచూసింది. ఇక గ్రేటర్‌‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో మేయర్‌‌ పీఠం కైవసం చేసుకున్నా.. నైతికంగా ఓటమి ఎదుర్కొన్నట్లేనని నిపుణులు అంటుంటారు. ఎందుకంటే గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని చెప్పుకొచ్చిన అధికార పార్టీ మంత్రులు, నేతలకు ఎదురుదెబ్బ తగిలింది. వంద సీట్లు వస్తాయని చెప్పుకున్నా.. మునుపటి ఎన్నికల కంటే తక్కువ సీట్లే వచ్చాయి.

Also Read: భాగ్యనగరిలో బతుకు భారం?

వీటన్నింటి నేపథ్యంలో పార్టీకి కనుక మరో ఓటమి ఎదురైతే ఇక ప్రజల్లోకి వెళ్లడం కష్టమే. టీఆర్‌‌ఎస్‌ పని అయిపోయినట్లేనని జనంలోకి సంకేతాలు వెళ్తాయి. అందుకే.. ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో నెగ్లెన్సీ అసలే వద్దనుకొని సీఎం కేసీఆర్‌‌ స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయానికి వచ్చారు. ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ఇవి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో బహిరంగసభలు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఓటర్లను నేరుగా కలవడం ఒక్కటే మార్గం. అయితే.. కేసీఆర్ అలా ఓటర్ల ఇళ్లకు వెళ్లి కలవడం కూడా సాధ్యమయ్యే పనికాదు. అందుకే.. కేసీఆర్ కొత్తగా ఆలోచించారు. రోజూ కొంత సమయం కేటాయించి.. ఓటర్లకు ఫోన్లు చేసి.. టీఆర్ఎస్ చేసిన పనులు వివరించి ఓటు వేయమని అభ్యర్థించబోతున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఇప్పటికే పార్టీ వద్ద కంప్లీట్‌ డేటా ఉంది. ఓటర్ల లిస్ట్ కూడా రెడీగా ఉంది. వారిలో రోజూ విభిన్నవర్గాలకు చెందిన వారికి ఫోన్లు చేస్తే మంచి పలితం వస్తుందని భావిస్తున్నారు. ఇలా ఫోన్లు చేసి.. మాట్లాడటం అంటే కేసీఆర్‌‌కు ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. తాను గతంలో సంస్కరణలు చేపట్టాలనుకున్నప్పుడు.. రెవెన్యూ శాఖ సమస్యలపై వ్యవసాయ అంశాలపై ఫోన్లు చేసి మాట్లాడారు. ఇప్పుడూ అదే పద్ధతిలో ఎమ్మెల్సీ ఎన్నికలకూ ప్రచారం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అనుకుంటున్నారు.

Also Read: రామచంద్రయ్య ప్లేసులో ఎమ్మెల్సీ దక్కాల్సింది ఆయనకట?

వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి కేసీఆర్‌‌కు పెద్దగా టెన్షన్ లేదు. సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎలాగోలా గెలిచి వస్తారని నమ్ముతున్నారు. అయితే.. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపైనే కేసీఆర్‌‌లో టెన్షన్‌ కనిపిస్తోంది. అక్కడ పెద్దగా టీఆర్ఎస్ గెలిచింది లేదు. పైగా యువత అసంతృప్తిగా ఉంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి. పైగా పీవీ నరసింహారావు కుమార్తెను నిలబెట్టారు. గెలిపించడానికి ప్రయత్నించకపోతే.. తాము అనుకున్న లక్ష్యం పూర్తిగా రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే కేసీఆర్ రోజుకు కొంత సమయం ఓటర్లకు ఫోన్లు చేసేందుకు కేటాయించనున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్