MLC Kavita : కవిత లాయర్ నెగ్గింది.. ఈడీ తరఫు వాదన వీగిపోయింది అక్కడే.. అందుకే ఆమెకు బెయిల్

 పలుమార్లు బెయిల్ పిటిషన్లు.. కోర్టుల తిరస్కరణలు.. అనకూల మీడియా కవిత కోణంలో ప్రసారం చేసే కథనాలు.. అననుకూల మీడియా చుక్కెదురు అంటూ రాసే వార్తలు.. ఇలా సాగిపోయిన తర్వాత.. మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చింది.

Written By: NARESH, Updated On : August 27, 2024 7:27 pm

Kavitha Lawyer

Follow us on

MLC Kavita :కవితకు బెయిల్ వస్తుందని నమ్మకంతో భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధైర్యంగా ప్రకటన చేశారు. హరీష్ రావు కవిత కచ్చితంగా బయటికి వస్తుందని స్పష్టత ఇచ్చారు. ఇందులో భాగంగానే సోమవారం సాయంత్రం వారు ఢిల్లీకి వెళ్లిపోయారు. కవిత భర్త అనిల్, హరీష్ రావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, కేటీఆర్ వంటి వారు మంగళవారం ఉదయమే సుప్రీంకోర్టు వెళ్లిపోయారు. కవిత తరఫున వాదించే లాయర్లతో సమావేశమయ్యారు. అనేక సమాలోచనలు జరిపారు. ఆ తర్వాత ఉదయం 11 గంటల సమయం దాటిన తర్వాత కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. దీంతో భారత రాష్ట్ర సమితి నాయకుల్లో హర్షం వ్యక్తం అయింది. పింక్ మీడియా కవితకు అనుకూలంగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది.

వాస్తవానికి కవితను మార్చి 15న ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తీహార్ జైలుకు పంపించారు. ఆమె ఆ జైల్లో ఉండగానే సిబిఐ అధికారులు కూడా అరెస్టు చేశారు. ఇక అప్పటినుంచి ఆమె బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కింది కోర్టులో తిరస్కరిస్తున్నప్పటికీ ఆమె తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నారు. కింది కోర్టులు బెయిల్ ఇవ్వకపోవడంతో కవిత ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ఆధ్వర్యంలో ధర్మాసనం అటు కవిత, ఇటు కేంద్ర దర్యాప్తు సంస్థల లాయర్ల వాదనలు విన్నది.. కవిత తరఫున ముకుల్ రోహత్గీ, ఎన్ ఫోర్స్ మెంట్, సీబీఐ తరపున రాజు వాదించారు..” ఆమెకు పారిపోవలసిన కర్మ లేదు.. సాక్షులను బెదిరించలేరు.. ఇంతవరకు కేసు నమోదు కాలేదని” ముకుల్ రోహత్గీ వాదించారు. దీనిపై ఎన్ ఫోర్స్ మెంట్, సీబీఐ తరఫున న్యాయవాదులు అభ్యంతర వ్యక్తం చేశారు.. అప్రూవర్లు గా మారిన వ్యక్తుల స్టేట్మెంట్లు ధర్మాసనం ఎదుట చదివి వినిపించారు..”ఈ కేసులో ఆధారాలను కవిత ధ్వంసం చేశారు. ఫేస్ టైం లో మా గుంట రాఘవతో కవిత మాట్లాడారు. ఆ రికార్డు తన ఫోన్లో లేకుండా కవిత డిలీట్ చేశారు.. రాఘవ అనంతరం డీల్ నడిపినట్టు” ధర్మాసనం ఎదుట కేంద్ర దర్యాప్తు సంస్థల న్యాయవాది పేర్కొన్నారు. ఇదే సమయంలో అప్రూవర్ గా మారిన మాగుంట శ్రీనివాసులు కొడుకు రాఘవ స్టేట్మెంట్ ఎలా తీసుకుంటారని కోర్టు ప్రశ్నించింది.. అయితే ఇదే దర్యాప్తు సంస్థల తరఫున లాయర్ కు స్పీడ్ బ్రేక్ వేసినట్టు అయింది. కేంద్ర దర్యాప్తు సంస్థ లాయర్ మధ్యాహ్నం రెండు గంటల వరకు సమయం కోరడంతో.. కోర్టు తోసిపొచ్చింది. ఆ తర్వాత మీ వాదన మారుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.. ఇదే సమయంలో సెక్షన్ 45 గురించి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇది మహిళల మొత్తానికి వర్తిస్తుందని వివరించింది.

ఈ కేసులో ఇప్పటికే విచారణ పూర్తి కావడం, ఛార్జ్ షీట్లు నమోదు కావడం, సెక్షన్ 45 ప్రకారం కవిత బెయిల్ పొందేందుకు అర్హురాలని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. 10 లక్షల విలువైన రెండు పూచీకత్తులు, పాస్ పోర్ట్ కోర్టుకు అప్పగించాలని, దర్యాప్తు సంస్థలకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని తీర్పును వెల్లడించింది. ఇదే సమయంలో కవిత మంగళవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.