Kavitha: తెలంగాణ రాక మునుపే ‘జాగృతి’ పేరుతో ఇక్కడ సంస్కృతి , సంప్రదాయాలను ఎలుగెత్తి చాటింది కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత. అనేక సంవత్సరాలుగా బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడంలో కవిత కృషి కాదనలేనిది. ఇటీవల బతుకమ్మ పండుగకు సైతం ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తో కలిసి ఓ బతుకమ్మ పాటను విడుదల చేసింది. దిగ్గజ దర్శకుడు గౌతం మీనన్ తో కలిసి ఈ పాటను తెరకెక్కించింది.

తెలంగాణ జాగృతితో బతుకమ్మను తెలంగాణ ఉద్యమంలో అంతర్భాగంగా చేసిన ఘనత కవితదే.. ప్రస్తుత తరానికి ప్రజాదరణ పొందించేలా చేసింది కవిత. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి బతుకమ్మ వీడియోను ప్రపంచంలోనే అతిపెద్ద భవనం దుబాయ్ లోని ‘బుర్జ్ ఖలీఫా’పై ప్రదర్శించేందుకు సిద్ధమైంది. దుబాయ్ లోని ఈ అతిపెద్ద భవనంపై పాటను ఇక్కడ ప్రదర్శించడానికి సిద్ధమయ్యారు.
ఇది బతుకమ్మ వైభవాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేరేలా చేస్తుంది. బతుకమ్మ వీడియో ను బుర్జ్ ఖలీఫాపై రేపు అక్టోబర్ 23న సాయంత్రం 9.40 గంటల నుంచి 10.40 గంటల మధ్య రెండు సార్లు ప్రదర్శించనున్నారు.
దీంతో బతుకమ్మ వైభవం విశ్వవ్యాప్తం కానుంది. కవిత చేస్తున్న ఈ ప్రయత్నం తెలంగాణ సమాజానికి గర్వకారణంగా మారింది.