Kavitha Is Correct: తెలంగాణలో మూడేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న 57 ఏళ్లు పైబడిన వారి దరఖాస్తులకు ఎట్టకేలకు మోక్షం కలిగినట్లు ఉంది. ‘జూలై నుంచి 57 ఏళ్లు నిండిన వారికి నెన్షన్లు వస్తాయి’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తనయ, ముఖ్యమైన మంత్రి కే.తారకరామారావు సోదరి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత ప్రకటించారు. 2018 ముందస్తు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీగా టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే 57 ఏళ్లు నిండిన వారికి కూడా పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చారు కానీ హామీ అలేగా ఉంది. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఆ నియోజకవర్గంలోని 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేశారు. ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రమంతా అమలు చేస్తామని ప్రకటించారు. కానీ… అమలు కాలేదు. తర్వాత గతేడాది జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేశారు. అదే సమయంలో 57 నిండిన వారు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవలని సూచించారు. ఈమేరకు ఇదివరకే దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ చేసుకున్నారు. ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి వ్యతిరేంగా వచ్చాయి. దీంతో పింఛన్ల పంపిణీ ఊసే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పల్లె ప్రగతి కార్యక్రమంలో శనివారం మాట్లాడుతూ ‘‘కరోనా కారణంగా కొన్ని పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. అయినా కూడా, పెన్షన్, రైతు భీమా, రైతు బంధు, లాంటివి ఎక్కడా ఆగలేదు’ అన్నారు. కరోనా కారణంగా కొన్ని పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. కరోనాతో మూడేండ్లు ఇబ్బంది పడ్డా, ఒక్క పూట కూడా మిషన్ భగీరథ నీళ్లు ఆగలేదు. ఒక్కపూట కూడా కరెంటు పోలేదు. రైతు బంధు, పెన్షన్ ఆగలేదు. ఇది కేవలం మన నాయకుడి పట్టుదలతోనే సాధ్యమైంది.’ అన్నారు. వచ్చే నెల నుంచి 57 ఏళ్లు నిండిన అర్హులకూ పింఛన్లు కూడా ప్రారంభించుకుందాం’ అని ప్రకటించారు.
కవితక్కా.. 57 ఏళ్ల లెక్క ఎట్లక్కా?
మూడేళ్ల క్రితం 57 ఏళ్లు నిండిన మహిళల నుంచి ప్రభుత్వం ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ఇప్పుడు దరఖాస్తుదారుల వయసు 60 నుంచి 61 ఏళ్లు ఉన్నాయి. మరి ఇప్పుడు వీళ్లకు పింఛన్ 57 ఏళ్లకే ఇస్తున్నట్లా.. పాత పద్ధతిలో 60 ఏళ్లు దాటినవారికి ఇచ్చినట్లుగా మంజూరు చేస్తున్నాట్లా. ఎమ్మెల్సీ కవిత చెప్పిన లెక్క ఏవిధంగా కరెక్టో ఆమె చెప్పాలంటున్నారు ప్రతిపక్ష నేతలు.
Also Read: Minister kTR: కేటీఆర్ చైనా జపం.. ఆయన వ్యాఖ్యల వెనుక అర్థం అదేనా?
ఉన్న పింఛన్లకే ఎదురు చూపులు..
తెలంగాణలో ఆరు నెలలుగా ఆసరా లబ్ధిదారులు నెలనెలా పింఛన్ల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వం విడతల వారీగా పింఛన్లు మంజూరు చేస్తోంది. కొన్ని జిల్లాలకు నెల చివరి వారంలో పింఛన్లు పంపిణీ చేస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుకు వేతనాలు కూడా ఇలాగే ఉన్నాయి. కొన్ని శాఖలకు ఒకవారం, మరికొన్ని శాఖలకు ఇంకో వారం అన్నట్లు దాదాపు 20వ తేదీ వరకు వేతనాలు మంజూరు చేయాల్సిన దీనస్థితిలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఉంది. ఈ క్రమంలో లోటును పూడ్చుకునేందకు ప్రభుత్వం ఇప్పటికే భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచింది. ఇటీవల మద్యం ధరలను, తాజాగా ఆర్టీసీ టికెట్‌తోపాటు, బస్‌పాస్‌ల ధరలను భారీగా పెంచింది. అయినా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కవిత జూలై నుంచి 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు ఇస్తామని ప్రకటించం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కవిత మాట కూడా 2018లో కేసీఆర్, 2019లో దుబ్బాక ఎన్నికల సమయంలో హరీశ్‌రావు, 2021లో హుజూరాబాద్ ఎన్నికల సమయంలో హరీశ్‌రావు ప్రకటించిన హామీగానే మిగిలిపోతుందా లేక కవిత చెప్తే కరెక్టే అన్నట్లు నిజమవుతుందా అనేది తేలాలంటే మరో 20 రోజులు ఆగాలి.