Vikram Second Week Collections: కమల్ హాసన్ విక్రమ్ మూవీతో ఇండియన్ బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్నారు. విక్రమ్ 2022 తమిళ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా రికార్డులకు ఎక్కింది. విక్రమ్ మూవీ అజిత్ వలిమై, విజయ్ బీస్ట్ చిత్రాల రికార్డ్స్ చెరిపివేసింది. తమిళనాడులో విక్రమ్ రూ. 100 కోట్ల మార్క్ దాటేసింది. అలాగే కేరళలో విక్రమ్ జోరు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అక్కడ కూడా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తమిళ చిత్రంగా విక్రమ్ నిలిచింది. వరల్డ్ వైడ్ గా విక్రమ్ కలెక్షన్స్ రూ. 300 కోట్లకు చేరువయ్యాయి. ఇక మలేసియాలో తమిళ చిత్రాలకు అధిక మార్కెట్ ఉంటుంది. ఈ ఏడాది అక్కడ అధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కెజిఎఫ్ 2 ఉంది. విక్రమ్ ఆ రికార్డు బ్రేక్ చేసే దిశగా వెళుతోంది.
తెలుగులో విక్రమ్ భారీ లాభాలు పంచింది. విడుదలకు ముందు మూవీపై అంతగా హైప్ లేదు. దీంతో హీరో నితిన్ రూ. 7 కోట్లకు ఏపీ/తెలంగాణా హక్కులు దక్కించుకున్నారు. ఫస్ట్ వీక్ ముగిసే విక్రమ్ రూ. 11 కోట్లకు పైగా షేర్ అందుకుంది. అంటే ఇప్పటికే రూ. 4 కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది. రెండో వారం కూడా బాక్సాఫీస్ వద్ద విక్రమ్ హవా నడుస్తుంది. మేజర్ కంటే విక్రమ్ కలెక్షన్స్ మెరుగ్గా ఉన్నాయి. చెప్పుకోదగ్గ పోటీ లేని క్రమంలో మరో రెండు మూడు వారాలు విక్రమ్ థియేటర్స్ లో సాలిడ్ రన్ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: Electric Vehicles: ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎందుకు పేలిపోతున్నాయి..? కారణాలేమిటి..?
మొత్తంగా విక్రమ్ ఫైనల్ ఫిగర్ భారీగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విక్రమ్ చిత్రానికి కమల్ హాసన్ నిర్మాతగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఫుల్ ఖుషీగా ఉన్నారు. వచ్చిన లాభాల నుండి విక్రమ్ చిత్రానికి పనిచేసిన టీం కి బహుమతులు ఇస్తున్నారు. దర్శకుడు లోకేష్ కి లగ్జరీ కార్, గెస్ట్ రోల్ చేసిన సూర్యకు రోలెక్స్ వాచ్, విక్రమ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కి బైక్స్.. బహుమతులుగా ఇచ్చారు.
మరోవైపు విక్రమ్ సీక్వెల్ పై వస్తున్న వార్తలు గూస్ బంప్స్ కలిగిస్తున్నాయి. లోకేష్ కనకరాజ్ విక్రమ్ సీక్వెల్ ఉన్నట్లు తెలియజేశారు. సూర్యను చివర్లో రోలెక్స్ సర్ గా పరిచయం చేసి సీక్వెల్ కి లీడ్ ఇచ్చారు. విక్రమ్, ఖైదీ చిత్రాలకు లింక్ ఉన్నట్లు చెప్పిన లోకేష్… విక్రమ్ 2 ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. విక్రమ్ సీక్వెల్ లో రామ్ చరణ్ కూడా నటించే అవకాశం కలదని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సీక్వెల్ కి ఇంకా సమయం ఉంది. నెక్స్ట్ లోకేష్ హీరో విజయ్ తో మూవీ చేస్తున్నారు. అనంతరం విక్రమ్ 2 కార్యక్రమాలు బిగిన్ అవుతాయి.