MLC Kavitha- ED: ఢిల్లీ మద్యం కుంభకోణం లో కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న ఈడీ సోమవారం సాయంత్రం పేల్చిన బాంబు ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కవిత.. మద్యం వ్యాపారం ద్వారా పొందిన లాభాలతో కొనుగోలు చేసిన భూముల వివరాలను ఈడీ తన ఛార్జ్ షీట్ లో ప్రస్తావించింది. అంతే కాదు హైదరాబాద్ లో భూముల ధరలు చుక్కలనంటుతున్న వేళ.. తక్కువకే కోట్ల రూపాయల విలువైన భూములను చౌక ధరలకే కవిత కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో కవిత భర్త కూడా ఉన్నాడు. ఆయన భాగస్వామి గా ఉన్న “ఎన్ గ్రోత్ క్యాపిటల్” అనే కంపెనీ పేరిట భూమి కొనుగోలు చేసినట్టు సమాచారం. మరోవైపు గచ్చిబౌలి శ్రీహిల్స్ లో కవిత బినామీ అరుణ్ రామచంద్రన్ భార్య పేరిట నాలుగు ఎకరాలు కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసినట్లు ఈడీ తన ఛార్జ్ షీట్ లో ప్రస్తావించింది. అయితే ఈ వివరాలు మొత్తం కవిత ఆడిటర్ అప్రూవర్ గా మారి చెప్పడంతో వీటిని ఈడీ తన అభియోగ పత్రంలో నమోదు చేసింది.. అయితే ఈసారి అనుబంధ చార్జ్ షీట్ దాఖలు చేయడం విశేషం. ఇందులో హోటల్ రికార్డులు, చాట్స్, ఈ మెయిల్స్ జత చేసి ఈడీ కవితకు కోలుకోలేని షాక్ ఇచ్చింది.
బుచ్చిబాబు వాంగ్మూలం ఆధారంగా
కవిత ఆడిటర్ గా పనిచేసిన బుచ్చిబాబుగా అప్రూవర్ గా మారి ఈడీ అధికారులకు కీలక విషయాలు చెప్పాడు.. దీంతో అరుణ్ రామచంద్రన్ కవిత బినామీ అని అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. కవిత, అరుణ్ రామచంద్రన్ మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్,ఈ మెయిల్ స్క్రీన్ షాట్లను జత చేసి ఈడీ అనుబంధ చార్జ్ షీట్ దాఖలు చేసింది.. దీనిని రౌజ్ అవెన్యూ లోని సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకుంది.
4 ఎకరాలు
గచ్చిబౌలిలోని శ్రీ హిల్స్ లో నాలుగు ఎకరాల భూమి కొనుగోలు కు క్రియేటివ్ డెవలపర్స్ తో అరుణ్ రామచంద్రన్ ఒప్పందం కుదుర్చుకున్నారు.. కవిత ఆదేశాల మేరకు ఇదంతా జరిగింది.. క్రియేటివ్ డెవలపర్స్ సంస్థలో రవిశంకర్ చెట్టి కీలక భాగస్వామిగా ఉన్నాడు.. అయితే రవిశంకర్ అరుణ్ రామచంద్రన్ కు ఈ భూమి అమ్మాడు. ఈ డీల్ శ్రీహరి అనే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుదిర్చాడు. అంతేకాదు ఈ భూమి కొనుగోలుకు సంబంధించి నగదును శ్రీ హిల్స్ ఖాతాలో మరో వ్యక్తి వేస్తాడని రవిశంకర్ కు చెప్పాడు.. అంటే ఇక్కడ భూమి కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరో అమ్మిన వ్యక్తికి చెప్పలేదన్నమాట. అసలు కొనుగోలు చేస్తున్న భూమి ఎక్కడ ఉందో చూడకుండానే ఈ లావాదేవీలు జరిగాయి. శ్రీహరి ద్వారా ఐదు కోట్లలో ముందస్తుగా చెల్లించినట్టు అరుణ్ రామచంద్రన్ చెప్పడం ఇక్కడ విశేషం. ఇంత జరిగిన కూడా భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొన్నాళ్లపాటు చేపట్టలేదు. అకస్మాత్తుగా 2022 మే నుంచి రిజిస్టర్ చేయకుండా మిగిలిపోయిన ఒక భూమి రిజిస్ట్రేషన్ ను ఈడీ దర్యాప్తు ప్రారంభమైన తర్వాత అదే ఏడాది అక్టోబర్ 11న అరుణ్ భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఈ భూ లావాదేవిలో ప్రధాన లబ్ధిదారు కవిత కాదు అని చెప్పేందుకు, చట్టపరంగా దొరికిపోకుండా ఉండేందుకు ఇలా చేశారని దర్యాప్తులో తేలింది.
మరో లావాదేవీలో..
ఎన్ గ్రోత్ క్యాపిటల్ సంస్థ పేరిట శ్రీహరి ద్వారా ఆస్తిని కొనుగోలు చేసినట్టు ఈ ఏడాది మార్చి 28న బుచ్చిబాబు ఈడీ కి ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించాడు. ఎన్ గ్రోత్ కంపెనీలో కవిత భర్త డిఆర్ అనిల్ కుమార్ భాగస్వామి. మార్కెట్ విలువ కంటే తక్కువ ధరకు గ్రోత్ కంపెనీ కొనుగోలు చేసింది. అలాగే, బీహార్ నుంచి 25 వేల చదరపు అడుగుల మరో ఆస్తిని కూడా కవిత కొనుగోలు చేశారు. కవిత సూచన మేరకు సంబంధిత పేపర్ వర్క్ బుచ్చిబాబు సమన్వయం చేశారు. మార్కెట్ లెక్కల ప్రకారం ఇక్కడ చదరపు అడుగుకు ₹1,760 రూపాయల విలువ ఉంది. కేవలం ₹1,260 మాత్రమే చెల్లించారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Kavitha bought land with liquor scam profits ed chargesheet
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com