KCR vs BJP : కవిత అరెస్ట్, కేసీఆర్ అవినీతి.. బీజేపీ వీడియో సంచలనం

KCR vs BJP : భారతీయ జనతా పార్టీ అధికారిక హ్యాండిల్ ట్విటర్‌లో సంచలన వీడియోను షేర్ చేసింది. బుధవారం పోస్ట్ చేసిన 96 సెకన్ల నిడివి గల వీడియో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది.. తెలుగు మీడియాపై పెద్దగా ఫోకస్ చేయకున్నా జాతీయ స్థాయిలో దుమారం రేపుతోంది.. తెలంగాణలో అందరి దృష్టి టీ-బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్, ఆయన అరెస్ట్ పైనే ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ, పంజాబ్ […]

Written By: NARESH, Updated On : April 6, 2023 4:28 pm
Follow us on

KCR vs BJP : భారతీయ జనతా పార్టీ అధికారిక హ్యాండిల్ ట్విటర్‌లో సంచలన వీడియోను షేర్ చేసింది. బుధవారం పోస్ట్ చేసిన 96 సెకన్ల నిడివి గల వీడియో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది.. తెలుగు మీడియాపై పెద్దగా ఫోకస్ చేయకున్నా జాతీయ స్థాయిలో దుమారం రేపుతోంది.. తెలంగాణలో అందరి దృష్టి టీ-బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్, ఆయన అరెస్ట్ పైనే ఉంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు, దర్యాప్తు అధికారి ఒకరు యానిమేషన్ వీడియోలో కనిపించారు. వీడియోలలో కేసీఆర్ అవినీతిని ప్రధానంగా హైలెట్ చేసినట్టుగా కనిపిస్తోంది.

“తెలంగాణ కా ఖజానా” అనే క్యాప్షన్‌తో యానిమేషన్ వీడియోను బీజేపీ పోస్ట్ చేసింది. డబ్బుల జోరు మధ్యలో కవిత క్యారికేచర్ చూపించారు. TR51 KTR నంబర్ ప్లేట్ ఉన్న అంబాసిడర్ కారులో కేసీఆర్ క్యారికేచర్ పెద్ద భవనంలోకి రావడంతో వీడియో ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ నిధుల  సూట్‌కేస్‌ను కేసీఆర్ తీసుకెళ్లాడు. తర్వాత ఆ డబ్బును వివిధ రాష్ట్ర పథకాల్లోకి జమ చేస్తాడు.  ఆ తర్వాత మళ్లించబడినట్టుగా వీడియోలో చూపించారు..

వ్యక్తిగత సంపదను పెంచుకున్న తర్వాత, సూట్‌కేసులో కొంత డబ్బు మిగిలిపోయి, మిగిలిన నిధులను కేసీఆర్ ఖజానాకు బదిలీ చేసినట్టుగా వ్యంగ్యంగా దీన్ని తీర్చిదిద్దారు. బంగారం, ఆభరణాలు , నగదుతో నిండిన ఖజానా కనిపిస్తుంది. కవిత క్యారికేచర్ నిధులను లెక్కపెడుతోంది. బంగారు నాణేలను లెక్కిస్తున్నట్టుగా కవిత కార్టూన్ ను చూపించారు.

కవిత కార్టూన్ ముందున్న ట్రేలో ఏడు ఫోన్‌లను చూపించారు. ఫోన్‌లు నిరంతరం మోగడం ప్రారంభించినప్పుడు ఆమె మాట్లాడి వెనక్కి విసిరేస్తున్నట్టుగా చూపించారు. రెండు ఫోన్‌లకు సమాధానమిచ్చి మిగతా వాటిని విసిరివేస్తుంది. జీఎస్టీ నిధులను, కేంద్ర ప్రభుత్వ నిధులను కేసీఆర్ క్యారికేచర్ దారి మళ్లించినట్టుగా చూపించారు. గ్రామ పంచాయితీ నిధులతో ఉన్న సూట్‌కేస్‌ను కూడా వదిలిపెట్టలేదు. కేసీఆర్ క్యారికేచర్ ప్రధాని సీటులో కూర్చోవాలని కలలు కంటున్నట్టు వీడియోలో చూపించారు.. ఆ పోగైన డబ్బుతో జాతీయ పార్టీని ప్రకటించినట్టుగా సెటైరికల్ గా తయారు చేశారు.

జాతీయ పార్టీని ప్రకటించగానే ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులతో పాటు కవిత హర్షం వ్యక్తం చేసినట్టుగా వీడియోలో ఉంది.. వాళ్ళు హ్యాపీ మూడ్‌లో ఉండగా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చి కవితకు సంకెళ్ళు చూపించాడు. అప్పుడు వీడియో ముగుస్తుంది.

ఈ వీడియో చూస్తే బీజేపీ ఏం చెప్పాలనుకుంటోందో అర్థమవుతోంది. మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతారని పార్టీ పరోక్ష సూచనలు ఇస్తోందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇక కేసీఆర్ అవినీతిని వదలమన్నట్టుగా బీజేపీ ఈవీడియోతో ఇక వార్ షురూ చేసినట్టు అర్థమవుతోంది.