Arvind Kejriwal on The Kashmir Files: గొప్ప సినిమాను రాజకీయం చేస్తే ఎలా ?

Arvind Kejriwal on The Kashmir Files: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’.. చిన్న సినిమాగా విడుదలై గొప్ప సంచలనం సృష్టించింది. బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ మూవీ పై ఇప్పటికే ప్రముఖులు స్పందిస్తూ చాలా గొప్పగా కామెంట్స్ చేశారు. నిజంగానే ఆ స్థాయిలో దేశవ్యాప్తంగా ఈ సినిమా సంచలనాలు సృష్టించింది. అయితే.. ఈ సినిమా పై ప్రశంసలు ఎలా కురిపిస్తున్నారో.. మరికొంతమంది విమర్శకులు అలాగే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ‘ది కశ్మీరీ […]

Written By: Raghava Rao Gara, Updated On : March 29, 2022 4:13 pm
Follow us on

Arvind Kejriwal on The Kashmir Files: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’.. చిన్న సినిమాగా విడుదలై గొప్ప సంచలనం సృష్టించింది. బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ మూవీ పై ఇప్పటికే ప్రముఖులు స్పందిస్తూ చాలా గొప్పగా కామెంట్స్ చేశారు. నిజంగానే ఆ స్థాయిలో దేశవ్యాప్తంగా ఈ సినిమా సంచలనాలు సృష్టించింది. అయితే.. ఈ సినిమా పై ప్రశంసలు ఎలా కురిపిస్తున్నారో.. మరికొంతమంది విమర్శకులు అలాగే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Arvind Kejriwal on The Kashmir Files

ఈ క్రమంలో ‘ది కశ్మీరీ ఫైల్స్’ సినిమాపై ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. అందరూ కాసేపు రాజకీయాలు పక్కనబెట్టి కశ్మీరీ పండిట్లకు సాయం చేయాలని హితవు పలికారు. ఆయన సినిమా గురించి మాట్లాడుతూ.. ‘కశ్మీరీ పండిట్ల ఇళ్లకు వెళ్లి సాయం చేద్దాం. వాళ్లకు సపోర్ట్ చేద్దాం. అంతేకానీ, వాళ్లపై సినిమాలు తీసి రూ.కోట్లు సంపాదించడం తప్పు’ అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చాడు.

Also Read: Taapsee Mishan Impossible: తాప్సీ ‘మిషన్..’కి నవీన్ పొలిశెట్టి మాట సాయం

అయితే, తాజాగా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆమె ఆర్ఆర్ఆర్ పై ప్రశంసలు కురిపిస్తూ.. ఈ క్రమంలో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమా గురించి నెగిటివ్ కామెంట్స్ చేసింది. ఈ సందర్బంగా సీతక్క మాట్లాడుతూ ‘మీరు భారత్ ను విడదీయాలనుకుంటే కశ్మీర్ ఫైల్స్ సినిమా చూడండి. లేదు, భారత దేశాన్ని కలపాలనుకుంటే ఆర్ఆర్ఆర్ సినిమాని వీక్షించండి అని ఆమె చెప్పుకొచ్చింది

Arvind Kejriwal on The Kashmir Files

పైగా ఎమ్మెల్యే సీతక్క ఇంకా మాట్లాడుతూ.. ఈ సినిమాకు అన్ని రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు ఇవ్వాలి. రాజమౌళికి నా అభినందనలు. తారక్, చరణ్ అద్భుతంగా నటించారు’ అని సీతక్క ట్వీట్ చేశారు. సరే.. ఏది ఏమైనా ఒక గొప్ప సినిమా పై ఇలా నెగిటివ్ కామెంట్స్ చేయడం తగదు. రాజకీయ పరంగా విభేదాలు ఉండొచ్చు, సిద్ధాంతాలు వేరు అయి ఉండొచ్చు. అంతమాత్రాన గొప్ప సినిమాను గొప్ప సినిమా కాదు అని అంటే.. ఎలా ?

Also Read: Deepika Padukone : బాలీవుడ్ క్రేజీ బ్యూటీకి అరుదైన అవార్డు

Recommended Video:

Tags