Senthil Kumar: ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన త్రిబుల్ ఆర్ సినిమా గురించి రోజూ ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ వినిపిస్తూనే ఉంది. కాగా ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడంతో మూవీ టీం ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ సందర్భంగా రాజమౌళి తీసే ప్రతి సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న సెంథిల్ కుమార్.. రీసెంట్ గా ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకున్నాడు.
రాజమౌళి తాను చేసే ప్రతి సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాలని ఆలోచించడం కంటే.. ప్రేక్షకులకు ఒక మంచి కథను అందించాలనే తాపత్రయ పడతాడని చెప్పారు. త్రిబుల్ ఆర్ ఇంటర్వెల్ సన్నివేశాలను దాదాపు 70 రోజులు రాత్రిపూట తెరకెక్కించామని వివరించారు. ఈ సినిమాలో అన్నిటికంటే పెద్ద సవాల్ ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో చూపించడం అని చెప్పుకొచ్చారు సెంథిల్ కుమార్. ముఖ్యంగా హీరోల పరిచే సన్నివేశాల కోసం తాము ఎక్కువగా కష్టపడ్డామన్నారు.
Also Read: Taapsee Mishan Impossible: తాప్సీ ‘మిషన్..’కి నవీన్ పొలిశెట్టి మాట సాయం
ఇందులో తారక్ ఇంట్రడక్షన్ సీన్ కోసం ఎక్కువ శ్రమించామని.. ఎందుకంటే ఆ ఫ్రేమ్ లో పులి సీన్స్ చేయడం అంటే మాటలు కాదని.. ఏ మాత్రం గ్రాఫిక్స్ లా అనిపించినా అభిమానులు ఒప్పుకోరు కాబట్టి.. ప్రపంచంలోనే అత్యుత్తమ విఎఫ్ఎక్స్ కంపెనీ అయిన ఎంపీసీకి ఆ సన్నివేశాలను తెరకెక్కించే బాధ్యతలను అప్పగించినట్లు సెంథిల్ కుమార్ వివరించారు.
ఈ సందర్భంగా బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాల మధ్య ఉన్న తేడాను చెప్పారు. బాహుబలి ఒక విజువల్ వండర్ మూవీ అని.. త్రిబుల్ ఆర్ ఎమోషనల్ డ్రామా అని ఈ రెండింటి మధ్య తేడాను చెప్పుకొచ్చారు. బాహుబలిలో గ్రాఫిక్స్ ఎక్కువగా వాడామని, కానీ త్రిబుల్ ఆర్ లో ఎమోషన్ సీన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు స్పష్టం చేశారు. త్రిబుల్ ఆర్ మూవీ లో హృదయాలను హత్తుకునే సీన్లు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు.
Also Read: Ghani Movie: ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్.. హైప్ వస్తుందా ?
Recommended Video: