Hizab Contoversy: కర్ణాటకలో మత ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. హిజాబ్ వ్యవహారంలో మొదలైన లొల్లి ప్రస్తుతం రాష్ట్రమంతా పాకింది. రెండు వర్గాలుగా విడిపోయి విద్యార్థులు ఆందోళన బాట పట్టాయి. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాలిత కర్ణాటకలో ఈ తంతు సాగడం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో తెలియడం లేదు. పరిస్థితి చేయి దాటి పోవడంతో స్కూళ్లు, కాలేజీలకు మూడు రోజులు సెలవులు ప్రకటించారు. గొడవ కాస్త హైకోర్టుకు చేరింది. విద్యార్థులు సంయమనం పాటించాలని కోరింది. తీర్పు బుధవారానికి వాయిదా వేసింది.
ఉడుపి జిల్లాలో మొదలైన వివాదం మొత్తం రాష్ట్రానికి పాకింది. విద్యార్థుల్లో హిజాబ్ (బురఖా) చిలికిచిలికి గాలివానలా మారింది. మతపరమైన అంశం కావడంతో రెండు వర్గాల్లో పట్టింపులు పెరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ కాలేజీలో ప్రారంభమైన ఘర్షణ ప్రస్తుతం రాష్ట్రమంతా వ్యాపించింది. విద్యార్థులు ఎంతకూ తగ్గడం లేదు. రెండు వర్గాలు తమ మాట నెగ్గాలని భావిస్తున్నాయి. దీంతో ఆందోళనలు మిన్నంటాయి.
Also Read: కమ్యూనిస్టులకు ప్రజాసమస్యలు పట్టవా? టీచర్లపైనే మక్కువ ఎందుకో?
విద్యార్థులు రాళ్లు రువ్వుకునే వరకు విషయం వెళ్లింది. దీంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి నానా ఇబ్బందులు పడ్డారు. శివమొగ్గలో 144 సెక్షన్ విధించారు.రాష్ట్రంలో కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో సున్నితమైన సమస్యను పరిష్కరించేందుకు కోర్టుకు వెళ్లడంతో కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. నివురు గప్పిన నిప్పులా రాజుకుంటోంది. దీంతో ఏం జరుగుతుందో అనే బెంగ అందరిలో పట్టుకుంది.
మత రంగు పులుముకున్న వివాదం కావడంతో రెండు వర్గాలను శాంతింపజేసేందుకు పోలీసులు చాలా కష్టపడాల్సి వస్తోంది. కోర్టు తీర్పు వచ్చిన తరువాత పరిస్థితి ఎటు వైపు దారి తీస్తుందో తెలియడం లేదు. దీంతో పోలీసులు ఫోకస్ పెడుతున్నారు. రెండు వర్గాలను గొడవలకు దిగకుండా చేసేందుకు భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రమంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎక్కడ కూడా ప్రజలు గుమిగూడవద్దని సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కర్ణాటకలో పరిస్థితిపై కేంద్రం కూడా ఆరా తీస్తోంది. వివాదం ఎక్కడ మొదలైంది? ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోతే ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించారు.రెండు వర్గాలను శాంతింపజేసే క్రమంలో పాటించాల్సిన పద్ధతులను గురించి ఓ అంచనాకు వస్తున్నారు.
Also Read: ఎంత పనైపాయె.. మోడీ వల్ల తలలు పట్టుకుంటున్న రాష్ట్ర బీజేపీ.. ఏకిపారేస్తున్న టీఆర్ ఎస్..