Jai Bhim: ‘జై భీమ్’.. సూర్య నటించి, నిర్మించిన ఈ సినిమా సామాన్య ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక విమర్శకుల ప్రశంసలను సైతం అందుకొంది. సూర్య అభిమానులను అయితే మెస్మరైజ్ చేసింది. పైగా ఇప్పటికే ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ప్రతిష్ఠాత్మక ఆస్కార్ పురస్కారాల సంబరం ప్రారంభమైంది. మార్చి 27న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సనం జరగనుంది.

ఈ సారి భారత్ తరపున ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ‘రైటింగ్ విత్ ఫైర్’ చిత్రం నామినేట్ అయింది. అయితే ఉత్తమ విదేశీ చిత్ర విభాగం తుది జాబితాలో స్క్రీనింగ్కు షార్ట్లిస్ట్ అయిన ‘జై భీమ్’, ‘మరక్కార్’ సినిమాలకు చోటు దక్కలేదు. మొత్తానికి ‘జై భీమ్’కు ఆస్కార్ మిస్ అయింది. కాకపోతే ఇటీవల ఆస్కార్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ‘సీన్ ఎట్ ది అకాడమీ’ పేరుతో ఈ సినిమాలోని ఓ సన్నివేశాన్ని వీడియో రూపంలో పోస్ట్ చేశారు.
Also Read: సిరిసిల్ల రివ్యూ.. తారక మంత్రమా.. మహేంద్ర జాలమా.. వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఏంటి..?
ఈ క్రమంలోనే బెస్ట్ ఫీచర్ ఫిలింగా ఆస్కార్-2022 అవార్డ్స్‌కి నామినేట్ అవ్వడంతో అందరూ ఈ సినిమాకు ఆస్కార్ రావాలని కోరుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. గతేడాది ది బెస్ట్ ఫిల్మ్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకున్న జైభీమ్, తాజాగా చైనాలోనూ విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మన దగ్గర IMDBలా చైనాకు చెందిన ప్రముఖ మీడియా సమీక్ష ప్లాట్‌ఫామ్ డౌబన్‌లో 8.7 రేటింగ్ సంపాదించుకుంది.

చైనా చరిత్రలో ఓ తల్లి జపాన్‌లో జరిగిన తన కూతురి హత్యపై న్యాయపోరాటం చేయడం, జైభీమ్ కథని పోలి ఉండడంతో, అక్కడి ప్రేక్షకులకి ఈ చిత్రం బాగా కనెక్ట్ అయిందంటున్నారు. ప్రముఖ న్యాయవాది, జస్టిస్ చంద్రు కథ ఆధారంగా ఈ సినిమాను డైరెక్టర్ జ్ఞానవేల్ తెరకెక్కించాడు. దేశ వ్యాప్తంగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది ఈ చిత్రం.
Also Read: సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు
[…] Tollywood Heroes: బాలీవుడ్ నుంచి అద్భుతమైన ఆఫర్లను తిరస్కరించిన సౌత్ సూపర్ స్టార్లు కొందరు ఉన్నారు. నిజానికి బాలీవుడ్ లో నటించాలని చాలామంది సౌత్ స్టార్స్ కి కోరిక ఉంటుంది. మరి ఎందుకు.. బాలీవుడ్ సినిమాలను రిజెక్ట్ చేశారు ? ఈ లిస్ట్ లో అల్లు అర్జున్, రష్మిక మందన్న నుంచి విజయ్ దేవరకొండ ఉండటం నిజంగా విశేషమే. మరి సౌత్ సూపర్ స్టార్స్ తిరస్కరించిన బాలీవుడ్ చిత్రాలను ఇక్కడ చూడండి. […]