Anti-Conversion Bill: కర్ణాటక ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటుందని తెలుస్తోంది. గతంలో కళాశాలలో హిజాబ్ వ్యవహారంలో కూడా తనదైన శైలిలో ప్రవర్తించిన కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుని వార్తల్లో నిలుస్తోంది. భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తి తన ఇష్టమైన మతాన్ని అవలంభించే స్వేచ్ఛ ఉందని తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం మత మార్పిడి నిరోధక బిల్లుపై గవర్నర్ ధావర్ చంద్ గెహ్లాట్ మంగళవారం ఆమోదం తెలిపడంతో బిల్లు చట్టంగా మారింది.

హిజాబ్ వ్యవహారంలో సుప్రీంకోర్టు సైతం పాఠశాలల్లో బురఖా అవసరం లేదని తేల్చి చెప్పడంతో రెండు వర్గాల్లో గొడవలకు కారణమైనా గొడవ మాత్రం సద్దుమణిగింది. దీంతో ఇప్పుడు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుని మత మార్పిడి నిరోధక ఆర్డినెన్స్ తేవడం కూడా కొందరికి ఆగ్రహం తీసుకొస్తుందని తెలుస్తోంది. కానీ బిల్లు చట్టంగా మారడంతో ఇక దాన్ని పాటించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
Also Read: Chandrababu Kadapa Tour: కడపలో బాబు కోసం పోటెత్తిన ప్రజానీకం.. అదుపు చేయలేక పోలీసుల తంటాలు
గత ఏడాది డిసెంబర్ లో కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు బిల్లును శాసనసభ ఆమోదించింది. దీంతో తప్పుడు దారిలో బలవంతంగా, ప్రలోభాలకు గురిచేస్తూ ఇతర మతాల్లోకి మార్పిడులు పెరిగాయి. దీంతో దాన్ని గుర్తించిన ప్రభుత్వం మత మార్పిడి నిరోధంపై చట్టం చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ బిల్లుతో పలు రకాల శిక్షలు విధించేందుకు సిద్ధమైంది.

చట్టాన్ని ఉల్లంఘించి మత మార్పిడులు చేపడితే వారికి మూడేళ్ల నుంచి ఐదేళ్ల జైలు, రూ. 25 వేల వరకు జరిమానా విధించే అవకాశముంది. సామూహిక మత మార్పిడులకు పాల్పడే వారికి మూడు నుంచి పదేళ్ల వరకు జైలు, రూ. లక్ష వరకు జరిమానా విధించే విధంగా చట్టం చేసింది. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. మత మార్పిడులకు వ్యతిరేకంగా బిల్లు తేవడంతో కొన్ని వర్గాలు నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఒక మతం నుంచి మరొక మతంలోకి బలవంతంగా మార్పిడి చేస్తే నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేస్తారు. మతమార్పిడులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగానే మత మార్పిడుల నిరోధక చట్టం తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో కొందరు హర్షిస్తున్నా కొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు.
Also Read:YCP- Rajya Sabha Members: ఇందులో పార్టీ జెండా మోసినవారేరీ?.. రాజ్యసభ ఎంపికపై భగ్గుమంటున్న వైసీపీ శ్రేణులు
Recommended Videos
[…] […]