Karnataka Government: డిసెంబర్ 31 నాడు చాలామంది మద్యం తాగుతారు. పాత సంవత్సరం ముగుస్తోందని.. సంవత్సరం చివరి రోజు ఎంజాయ్ చేయాలని.. పీకలదాకా తాగుతారు.. అదే స్థాయిలో తింటారు. పాటలు పెట్టుకుని డ్యాన్సులు చేస్తారు. కేకులు కట్ చేసి సంబరాలు చేసుకుంటారు. ఇక కొంతమంది యువత అయితే బైక్ ల మీద ఎక్కి విన్యాసాలు చేస్తారు. సాధారణంగా మద్యం తాగిన తర్వాత శరీరం మైకంలోకి వెళ్తుంది. ఆ సమయంలో అడుగు తీసి అడుగు వేయాలంటే ఇబ్బంది ఎదురవుతుంది. ఇక పోలీసుల డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు సరే సరే. పొరపాటున పోలీసులకు దొరికిపోతే పడే శిక్షలు.. విధించే అపరాధ రుసుముల గురించి చెప్పాల్సిన పనిలేదు.
వాస్తవానికి డిసెంబర్ 31 నాడు దేశవ్యాప్తంగా పోలీసులు ప్రత్యేకంగా శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తుంటారు. మందు బాబులకు షాక్ ల మీద షాక్ లు ఇస్తుంటారు. వాస్తవానికి మందు బాబులను ప్రభుత్వానికి టాక్స్ పేయర్లు అంటుంటారు. డిసెంబర్ 31 నాడు మాత్రం ప్రభుత్వం టాక్స్ పేయర్ల విషయంలో ఏ మాత్రం కనికరం చూపదు. మద్యం అర్ధరాత్రి దాకా అమ్ముతుంది.. అలాగని తాగడానికి ఏమాత్రం వెసలు బాటును కల్పించదు. కర్ణాటక రాష్ట్రం మాత్రం ఎందుకు భిన్నమైన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర డిసెంబర్ 31 నాడు తాను ప్రకటించిన మాట మీద నిలబడ్డారు. నడవలేని స్థితిలో ఉన్న మందు బాబులను ఇంటి వద్ద దింపుతామని ఆయన ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆయన మోహరించి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
డిసెంబర్ 31 నాడు కర్ణాటక వ్యాప్తంగా 15 ప్రాంతాలలో మందు బాబులకు రెస్టింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. బాగా మద్యం తాగినవారు అక్కడ పడుకున్నారు. మత్తు దిగిన తర్వాత వెళ్లిపోయారు. కర్ణాటక వ్యాప్తంగా బెంగళూరు, బెలగావి, మైసూరు, మంగళూరు, హుబ్లీ వంటి ప్రాంతాలలో రెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని పరమేశ్వర ప్రకటించారు. పరమేశ్వర ప్రకటించిన మాట మీద నిలబడరని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. కానీ ఆయన అలా కాకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని మోహరించి.. మందు తాగి.. కనీసం నడవలేని స్థితిలో ఉన్న మందుబాబులను రెస్టింగ్ సెంటర్ల వద్ద దింపే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వారిని మైకం తగ్గిన తర్వాత ఇళ్లకు పంపించారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గాయని కర్ణాటక మీడియాలో వార్తలు వస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మందుబాబుల నుంచి సానుకూల స్పందన వ్యక్తం అయింది. ఇలాంటి ప్రభుత్వమే ఉండాలని సోషల్ మీడియాలో మందుబాబులు కామెంట్లు చేయడం విశేషం.
The Karnataka government has announced special measures to handle New Year’s Eve celebrations, including arrangements to safely assist people who are heavily intoxicated. Home Minister G Parameshwara said that the state government will drop “heavily drunk” people to their homes… pic.twitter.com/2T3Kr7JQ7p
— Hindustan Times (@htTweets) December 31, 2025