Spirit Movie First Look: కొత్త సంవత్సరం రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ‘స్పిరిట్'(Spirit Movie) మూవీ ఫస్ట్ లుక్ తో ఘనంగా మొదలైంది. ప్రతీ సందీప్ వంగ సినిమాలో హీరో ఎలాంటి క్యారక్టర్ ఆర్క్ తో ఉంటాడో, ఈ సినిమాలో కూడా అదే స్టైల్ లో కనిపించాడంటేహి అభిమానులు మెంటలెక్కిపోయారు. ఆల్ఫా మేల్ థియరీ తో సందీప్ వంగ సినిమాలు ఉంటాయి. అలాంటి క్యారెక్టర్ ఆర్క్ ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కి పడితే ఎలా ఉంటుందో మన ఊహలకి కూడా అండవు. మరి సందీప్ వంగ ఊహల్లో ప్రభాస్ ని ఎలా వాడాలో అలా వాడుకున్నాడు. శరీరమంతా గాయాలు, ఆ గాయాలపై ప్లాస్టర్లు. ఎదురుగా హీరోయిన్ నిల్చొని సిగరేట్ వెలిగించడం, ప్రభాస్ చేతిలో మందు బాటిల్, ఇలా ఈమధ్య కాలం లో ఏ ఇండియన్ సూపర్ స్టార్ న అయినా చూశామా?, అది వంగ మార్క్ అంటే అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు.
ప్రభాస్ శరీరం మీదనే అన్ని గాయాలు ఉంటే, ఇక అవతల వైపు ఎన్ని శవాలు లేచి ఉంటాయో మీరే ఊహించుకోండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన వెంటనే సోషల్ మీడియా మొత్తం ఊగిపోయింది. అర్థ రాత్రి పూట విడుదల చేసినప్పటికీ కూడా, ట్విట్టర్ లో పాతిక వేలకు పైగా రీట్వీట్స్ వచ్చాయి. అదే విధంగా ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో దడ్కలుగా 15 లక్షల లైక్స్ వచ్చాయి. ఈమధ్య కాలం లో ఒక స్టార్ హీరోకు ఇలాంటి ఫస్ట్ లుక్ పడలేదని, అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు తారా స్థాయిలో లేపే విధంగా ఈ ఫస్ట్ లుక్ ఉందని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా పై యూత్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్, మహేష్ రాజమౌళి ‘వారణాసి’ మూవీ మీద కూడా లేదని అంటున్నారు నెటిజెన్స్.
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఈ నెల మూడవ వారం నుండి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ ని పూర్తి చేశారు. నెలరోజులకు పైగా సాగే ఒక భారీ షెడ్యూల్ ని త్వరలో మెక్సికో లో షూట్ చేయబోతున్నారు. ప్రభాస్ ఈ చిత్రం కోడం దాదాపుగా 80 రోజులకు పైగా డేట్స్ ని కేటాయించాడట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాని మనం థియేటర్స్ లో చూడొచ్చని అంటున్నారు. ఎప్పుడొచ్చినా సరే, ఈ సినిమా సృష్టించే బీభత్సం ముందు ఏది పనికిరాదని అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరో వారం రోజుల్లో విడుదల కాబోతున్న ‘రాజా సాబ్’ ని కూడా పక్కన పెట్టి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ స్పిరిట్ మూవీ కి వైబ్ అవుతున్నారు.