MLC Elections : ఉత్తరాంధ్రలో కాకరేపిన కాపు మీటింగ్, వైసీపీకి ఎదురీత తప్పదా?

MLC Elections : కొన్నిసార్లు ఎన్నికల ప్రచారాల్లో పార్టీలు సెల్ఫ్ గోల్ చేసుకుంటాయి. ఉత్తరాంధ్రలో వైసీపీ పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయదుందుభి మోగిద్దామని వేసిన ప్లాన్ రివర్స్ కొట్టింది. కాపు సామాజిక వర్గ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ ఆ సామాజిక వర్గ ఓటర్లను ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఆ ప్రభావం అభ్యర్థి గెలుపుపై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించడంలో కొన్ని ఘటనలు కీలకంగా మారతాయి. అలాంటి ఓ […]

Written By: SHAIK SADIQ, Updated On : March 11, 2023 10:24 pm
Follow us on

MLC Elections : కొన్నిసార్లు ఎన్నికల ప్రచారాల్లో పార్టీలు సెల్ఫ్ గోల్ చేసుకుంటాయి. ఉత్తరాంధ్రలో వైసీపీ పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయదుందుభి మోగిద్దామని వేసిన ప్లాన్ రివర్స్ కొట్టింది. కాపు సామాజిక వర్గ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ ఆ సామాజిక వర్గ ఓటర్లను ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఆ ప్రభావం అభ్యర్థి గెలుపుపై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది.

ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించడంలో కొన్ని ఘటనలు కీలకంగా మారతాయి. అలాంటి ఓ సమావేశం వైసీపీ చావుదెబ్బ కొట్టేలా చేసింది. వైసీపీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు భాగంగా విశాఖ పట్టణంలో కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైసీపీ అభ్యర్థిని గెలిపించేందుకు అందరినీ సమాయత్తం చేయడం ముఖ్య ఉద్దేశ్యం. కానీ, ఆ పార్టీ నేతలు చేసిన పని ఆ పార్టీ అభ్యర్థి విజయ అవకాశాలపై ప్రభావం చూపేలా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో వైసీపీ తరుపున సీతంరాజు సుధాకర్ పోటీ చేస్తున్నారు. టీడీపీ తరుపున వేపాడ చిరంజీవిరావు ఆయనకు ప్రత్యర్థిగా ఉన్నారు. ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందినవారవడంతో పోటీ రసవత్తరంగా మారింది. నిన్నటి వరకు కాపు సామాజిక వర్గ నేతలంతా సీతంరాజు సుధాకర్ కు ఎక్కువగా మద్దతుగా నిలిచారు. కానీ, ప్రచారం చివరి రోజు ఏర్పాటు చేసిన సభకు ఆ సామాజిక వర్గ నేతలకు సమాచారం ఇవ్వలేదట. దీంతో పార్టీ కోసం కష్టపడుతున్నా, గుర్తింపు ఇవ్వకపోవడం ఏమిటని ఆగ్రహానికి గురై వేపాడను గెలిపించేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తుంది.

అంతేగాక, కాపు సామాజిక వర్గ నేతలంతా ఏకమైన వైసీపీకి తగిన బుద్ధి చెప్పి సత్తా చూపించాలని భావిస్తున్నట్లు సమాచారం. తమ సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిరావుకు గెలిపించేందుకు ఏకమై ఓ జేఏసీగా కూడా ఏర్పాటయ్యారట. స్వచ్ఛందంగా కొందరు నేతలు ముందుకొచ్చి ఆయనను గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. వీరంతా కలిసి టీడీపీకే ఓటేయాలని అంతర్గతంగా అందరికీ సమాచారాలు చేరవేస్తున్నారని తెలుస్తుంది.

ఏది ఏమైనా వైసీపీ నేతలు సెల్ఫ్ గోల్ చేసుకొని విజయావకాశాలను చేజార్చుకోవడం హఠాత్పరిణామమే. జరగబోతున్న ఎమ్మెల్సీ ఇరు పార్టీలకు ప్రధానమైనవే. అటువంటి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్న సంగతి మరిచిపోయి ఓవర్ కాన్ఫిడెన్స్ కు వెళితే నష్టమన్న విషయం గురైరగాలి.