
Kanna Lakshminarayana- Chandrababu: బీజేపీ రాష్ట్ర మాజీ చీఫ్, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరికకు రంగం సిద్ధమైంది. గురువారం చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. అయితే ఏ పార్టీలో చేరాలన్నది ఆయన ఇష్టమైనా.. గతంలో చంద్రబాబు పై కన్నా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వాటినే ట్రోల్ చేస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి చంద్రబాబు కన్నాను అణగదొక్కేందుకు చేయని ప్రయత్నం లేదు. 1989 నుంచి 2014 వరకూ కన్నా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటైన ప్రతీసారి కన్నా మంత్రిగా వ్యవహరించారు. టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న కన్నాపై.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కన్నా చంద్రబాబుపై ఫైర్ అవుతుండే వారు. నాడు కన్నా చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి.
ముఖ్యంగా తనను అంతమొందించడానికి చంద్రబాబు ప్రయత్నించారంటూ కన్నా నాడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వాడెవడంటూ బాబును ఏక వాక్యంతో సంభోదిస్తూ చేసిన కామెంట్స్ కూడా పెను దుమారం రేపుతున్నాయి. అప్పట్లో వారంతపు కామెంట్స్ పేరిట, ఓపేన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమానికి కన్నా హాజరయ్యారు. ఏబీఎన్ రాధాక్రిష్ణ చంద్రబాబుపై ఎందుకంత కోపం అని ప్రశ్నించారు. చంద్రబాబు గుంటూరులో తనను, కృష్ణా జిల్లాలో వంగవీటి మోహన్ రంగాను అంతమొందించేందుకు ప్రయత్నించారని కన్నా ఆరోపించారు. రంగా విషయంలో సక్సెస్ అయ్యారు.. కానీ తన విషయంలో మాత్రం ఫెయిలయ్యారని చెప్పుకొచ్చారు. ఇప్పుడవే కామెంట్స్ ను రాజకీయ ప్రత్యర్థులు సోషల్ మీడియాలో పెడుతూ వైరల్ చేస్తుండడం విశేషం.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా ఉన్నప్పుడు మరో జర్నలిస్టును ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో టీడీపీ, బీజేపీ పొత్తు వ్యవహారం గురించి జర్నలిస్టు ప్రస్తావించారు. ఆ సందర్భంగా పొత్తులు డిసైడ్ చేసేందుకు వాడెవడంటూ చంద్రబాబును ఉద్దేశించి అగౌరవంగా మాట్లాడారు. అటువంటి వ్యక్తి నీడలోపనిచేసేందుకు ఇప్పుడు ఎలా వెళుతున్నారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకే మీడియా అంత ప్రాధాన్యమిస్తుందని.. అసలు వాడేవడంటూ రుసరుసలాడుతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఇవన్నీ ఇప్పుడు టీడీపీలో చేరుతున్న కన్నాకు ప్రతిబంధకంగా మారుతున్నాయి.
