Congress: వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో జరిగే అయిదు స్టేట్ల ఎన్నికల్లో ప్రభావం చూపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. వరుస పరాజయాలతో కుంగిపోతున్న పార్టీకి జవసత్వాలు నింపే పనిలో నాయకత్వం ఆలోచిస్తోంది. ఇన్నాళ్లు స్వయంకృతాపరాధంతోనే పలు ప్రాంతాల్లో అధికారం కోల్పోయిన పార్టీ తిరిగి పునర్వైభవం తెచ్చుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పావులు కదుపుతున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని సంసిద్ధం చేసే పనిలో పడింది. ఇప్పటి నుంచే పలువురిని పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది.

గతంలో జరిగిన ఐదు స్టేట్ల ఎన్నికల్లో తమిళనాడు, అస్సాం, పశ్చిమబెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ విజయం అందుకోలేకపోయింది. దీంతో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. దీని కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తోంది. వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటివరకు జరిగిన ఎదురుదెబ్బలను దాటుకుని పార్టీని విజయతీరాలకు చేర్చాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రణాళికలు రచిస్తోంది.
పార్టీలో యువరక్తాన్ని ఎక్కించేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాల్లో చురుగ్గా ఉన్న నేతలను తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్, గుజరాత్ కు చెందిన శాసనసభ్యులు జిగ్నేష్ మేవాణిలను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు.
ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలతో పార్టీలో జవసత్వాలు నింపే పనిలో పడింది. కొత్త రక్తం ఎక్కించి పార్టీని బలోపేతం చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి కొత్త వారిని తీసుకుని పార్టీ విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు రచించాలని భావిస్తోంది. ఇప్పటికే పలు మార్పులు చేసి పార్టీని అధికారంలోకి తేవాలని నేతల ఆలోచన.
కన్హయ్య కుమార్ ప్రస్తుతం సీపీఐలో కొనసాగుతున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్తి గిరిరాజ్ సింగ్ పై పోటీ చేసి ఓటమి చెందారు. దీంతో ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని తద్వారా ఓట్లు సాధించాలని వ్యూహం సిద్దం చేస్తున్నారు. కన్హయ్య కుమార్ రాకతో పార్టీలో జోష్ పెరుగుతుందని ఆశిస్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ మళ్లీ పునర్వైభవం సాధిస్తుందా అనే ఆలోచన అందరిలో నెలకొంది.