https://oktelugu.com/

నువ్వొక చెత్త ప్రోడక్ట్ అంటూ సీఎం మీద స్టార్ హీరోయిన్ చిందులు

బాలీవుడ్ సినీ పరిశ్రమ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో మొదలైన వివాదాలు ఇప్పుడు రాజకీయాల వరకు పాకాయి. సుశాంత్ సింగ్ మరణం నుండి డ్రగ్స్ రాకెట్ వెలుగు చూసింది. అందులో రియా చక్రబర్తి అరెస్ట్ కాదా దీపికా పదుకొనె, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ లాంటి స్టార్ హీరోయిన్ల పేర్లు బయటికి రావడం వారు విచారణను ఎదుర్కోవడం జరిగింది. ఈ వ్యవహారం రాజకీయంగా కూడ పెను దుమారాన్ని రేపింది. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : October 26, 2020 / 05:10 PM IST
    Follow us on


    బాలీవుడ్ సినీ పరిశ్రమ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో మొదలైన వివాదాలు ఇప్పుడు రాజకీయాల వరకు పాకాయి. సుశాంత్ సింగ్ మరణం నుండి డ్రగ్స్ రాకెట్ వెలుగు చూసింది. అందులో రియా చక్రబర్తి అరెస్ట్ కాదా దీపికా పదుకొనె, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ లాంటి స్టార్ హీరోయిన్ల పేర్లు బయటికి రావడం వారు విచారణను ఎదుర్కోవడం జరిగింది. ఈ వ్యవహారం రాజకీయంగా కూడ పెను దుమారాన్ని రేపింది.

    Also Read: చైనా దూకుడుకు కళ్లెం.! అమెరికాతో భారత్‌ సీక్రెట్ చర్చలు

    మొదటి నుండి బాలీవుడ్ వివాదాలపై స్పందిస్తూ వచ్చిన స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సెలబ్రిటీల మీద, మహారాష్ట్ర ప్రభుత్వం మీద విపరీత విమర్శలు చేశారు. దీంతో శివసేన ప్రభుత్వానికి ఆమెకు యుద్ధం మొదలైంది. ఆమె ముంబై రావడానికి కేంద్రం సెక్యూటిరీ ఇచ్చేంతగా వివాదం పెరిగింది. తాజాగా దసరా రోజున మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కొందరు బ్రతుకుదెరువు కోసం ముంబై వచ్చి ఇప్పుడు ముంబయిని పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనడం దారుణం అంటూ ఫైర్ అయ్యారు.

    Also Read: టీడీపీ, వైసీపీ మోసాన్ని బయటపెట్టిన సోము వీర్రాజు

    కంగనా సైతం ముఖ్యమంత్రి మీద గట్టిగానే విరుచుకుపడింది. సీఎం మీరు నెపోటిజం యొక్క చెత్త ప్రొడక్ట్. నేను మీలా తండ్రి డబ్బు, పలుకుబడి మీద ఆధారపడి బ్రతకట్లేదు. అలా బ్రతకాలి అనుకుంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండేదాన్ని. నాకు ఆత్మగౌరవం ఉంది. నాకు మీ కుమారుడి వయసుంటుంది. స్వయం ప్రతిభతో ఎదిగిన ఒక మహిళ గురించి దసరా రోజున మీరలా మాట్లాడటం చూస్తే సిగ్గు వేస్తోంది అంటూ రివర్స్ అటాక్ చేసింది. ఆమె మాటల్తో శివసేన నేతలు భగ్గుమంటున్నారు.