https://oktelugu.com/

హైదరాబాద్ లో కంగనా.. గోప్యంగా ఉంచిన అధికారులు..!

బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ కొద్దిరోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. కంగనా తన సినిమాలతోపాటుగా రాజకీయ, సామాజిక అంశాలపై సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని ముక్కుసూటి చెబుతూ ఉంటుంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య.. డ్రగ్స్ కేసు.. నెపోటిజం.. ఇండస్ట్రీలో గాఢ్ ఫాదర్ వంటి అనేక అంశాలపై కంగనా తనదైన శైలిలో స్పందించింది. హిందువులపై దాడుల నేపథ్యంలోనూ ఆమె ఘాటుగా స్పందించింది. మహారాష్ట్ర సీఎం థాక్రే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా.. రాహుల్ గాంధీలపై విమర్శలు చేసింది. సుశాంత్ ఆత్మహత్య […]

Written By: , Updated On : October 2, 2020 / 05:02 PM IST
Follow us on

బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ కొద్దిరోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. కంగనా తన సినిమాలతోపాటుగా రాజకీయ, సామాజిక అంశాలపై సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని ముక్కుసూటి చెబుతూ ఉంటుంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య.. డ్రగ్స్ కేసు.. నెపోటిజం.. ఇండస్ట్రీలో గాఢ్ ఫాదర్ వంటి అనేక అంశాలపై కంగనా తనదైన శైలిలో స్పందించింది.

హిందువులపై దాడుల నేపథ్యంలోనూ ఆమె ఘాటుగా స్పందించింది. మహారాష్ట్ర సీఎం థాక్రే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా.. రాహుల్ గాంధీలపై విమర్శలు చేసింది. సుశాంత్ ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు, ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని ఆమె వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమె వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే శివసేన నేతలు కంగనాను టార్గెట్ చేస్తూ దుర్భాషలాడారు. దీంతో శివసేన-కంగనాల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది.

కంగనా బీజేపీకి వంతపాడుతుందని శివసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ముంబైలోని కంగనా ఇంటిని మహారాష్ట్ర ప్రభుత్వం కూల్చివేయడం మరింత వివాదానికి దారితీసింది. ఈనేపథ్యంలోనే ఆమెను తనకు భద్రత కావాలని కేంద్రాన్ని కోరింది. ఆమె విజ్ఞప్తి మేరకు కేంద్రం ఆమెకు వై కేటగిరి భద్రత కల్పించింది. అయితే దీనిపై కూడా విమర్శలు వెల్లువెత్తారు. కేంద్రం ఆమెకు భద్రత కల్పించడాన్ని కొందరు స్వాగతించగా మరికొందరు వ్యతిరేకించారు.ఇదిలా ఉంటే కంగనా రనౌత్ తాజాగా భాగ్యనగరంలో కన్పించారు. ఆమె హైదరాబాద్ కు వచ్చే వరకు కూడా అధికారులు ఈ విషయాన్ని గొప్యంగా ఉంచారు. అయితే కంగనా పదిరోజులపాటు హైదరాబాద్లో ఉంటారని తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో పదిరోజులపాటు కంగనా సినిమా షూటింగులో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిందని సమాచారం. ప్రస్తుతం కంగనాకు వై కేటగిరి భద్రత ఉండగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆమెకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తోంది.